మీటింగులు...షూటింగ్ లు.. క్యాన్సిల్.. ప్రైవసీ ప్లీజ్.. హైటెన్షన్‌లో స్టార్ హీరో !
సల్మాన్ ఖాన్- బాబా సిద్ధిక్ గొప్ప సన్నిహితులు కావడంతో భవిష్యత్ పరిణామాలపై అందరూ ఊహిస్తున్నారు.
By: Tupaki Desk | 14 Oct 2024 4:10 AM GMTప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ స్నేహితుడు అయినందుకు ఒక ముంబై నాయకుడు హత్యకు గురయ్యాడన్న వార్త భారతదేశాన్ని ఒణికించింది. దావూద్ తర్వాత ముంబైని షేక్ చేస్తున్న ఘనుడిగా పంజాబీ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. ఒక్క రోజులో సన్నివేశం మారిపోయింది. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖ్ హత్యకు సంబంధించిన వార్తలు అనేక ఆందోళనలను లేవనెత్తాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రముఖ రాజకీయ నాయకుడిని హత్య చేసి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నేరుగా బెదిరించారంటే అతడి రేంజు గురించి చర్చ సాగుతోంది. ఈ ఆందోళనల మధ్య బాంద్రాలోని అతని కుటుంబాన్ని, ఇంటిని కవర్ చేస్తూ సల్మాన్ ఖాన్ భద్రతను పెంచినట్లు కథనాలొస్తున్నాయి. ఇంకా చెప్పాలంటూ సల్మాన్ ఖాన్ తీవ్ర కలతలో ఉన్నారు. ఈ సమయంలో అతడు తన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
సల్మాన్ ఖాన్- బాబా సిద్ధిక్ గొప్ప సన్నిహితులు కావడంతో భవిష్యత్ పరిణామాలపై అందరూ ఊహిస్తున్నారు. గౌరవనీయమైన రాజకీయ నాయకుడైన తన స్నేహితుడి మరణం సల్మాన్‌ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అతడు తెల్లవారుజామున మృతుని కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్నప్పుడు అతను ఉద్విగ్నంగా అసౌకర్యంగా కనిపించాడు. ఇండియా టుడే కథనం ప్రకారం.. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్, అతడి కుటుంబంతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. ఒక సోర్స్ ప్రకారం..భాయ్ అంత్యక్రియల ఏర్పాట్లు సహా ప్రతి చిన్న విషయానికి సంబంధించిన వివరాలను ఫోన్‌లో కనుక్కుంటున్నారని తెలిసింది. సల్మాన్ కొద్ది రోజుల పాటు తన వ్యక్తిగత సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
ప్రస్తుత పరిస్థితులతో సల్మాన్ కుటుంబం కూడా ప్రమాదంలో ఉందని, వారికి గోప్యత కావాలని భావిస్తున్నాడని కూడా చెబుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సల్మాన్ స్నేహితులు చాలా మంది అతడిని కలవడానికి కూడా దూరంగా ఉన్నారు. ముంబై పోలీసులు సిద్ధిక్ హత్యకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత, ఆయుధ చట్టం .. మహారాష్ట్ర పోలీసు చట్టంలోని వర్తించే సెక్షన్‌లను ప్రయోగిస్తూ కేసు నమోదు చేశారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పబ్లిక్ పోస్ట్ కలకలం
బాబా సిద్ధిక్ హత్యకు బాధ్యత వహిస్తూ, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ``ఓం, జై శ్రీ రామ్, జై భారత్. నేను జీవితం సారాన్ని అర్థం చేసుకున్నాను. సంపద శరీరాన్ని ధూళిగా భావిస్తాను. నేను స్నేహం కర్తవ్యాన్ని గౌరవిస్తూ సరైన పని మాత్రమే చేసాను`` అని రాసారు.
``సల్మాన్ ఖాన్.. మేము ఈ యుద్ధం కోరుకోలేదు. కానీ మీ వల్ల మా అన్నయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు బాబా సిద్ధిక్ మర్యాద పూల్ మూసివేసాం.. లేదా ఒకప్పుడు అతను దావూద్‌తో కలిసి MCOCA (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద ఉన్నాడు. అతడి మరణానికి కారణం బాలీవుడ్, రాజకీయాలు, ఆస్తి లావాదేవీలలో దావూద్, అనుజ్ థాపన్‌లకు ఉన్న సంబంధాలే. మాకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయితే, సల్మాన్ ఖాన్‌కి లేదా దావూద్ గ్యాంగ్‌కు సహాయం చేసే వారెవరైనా సిద్ధంగా ఉండాలి. మా సోదరులు ఎవరైనా చనిపోతే మేము ప్రతిస్పందిస్తాము, మేము ఎప్పుడూ సమ్మె చేయము. జై శ్రీరామ్, జై భారత్, వందనం అమరవీరులకు`` అని రాసారు.