మురుగదాస్‌ని టార్గెట్ చేస్తున్నారా?
నెటిజనులు ఈ సినిమా టీజర్ సహా ప్రమోషనల్ మెటీరియల్ పై రకరకాల కామెంట్లు గుప్పించారు.
By: Tupaki Desk | 4 March 2025 8:30 AM ISTసల్మాన్ ఖాన్ కథానాయకుడిగా బాలీవుడ్ లో ఏ.ఆర్.మురుగదాస్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాజిద్ నడియాడ్ వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మధ్యలో చాలా చిక్కుల్ని ఎదుర్కొంటోందని, బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయాయని ఇంతకుముందు ప్రచారం సాగింది. నెటిజనులు ఈ సినిమా టీజర్ సహా ప్రమోషనల్ మెటీరియల్ పై రకరకాల కామెంట్లు గుప్పించారు.
ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో మధ్యంతరంగా నిలిచిపోయిందంటూ షాకింగ్ గాసిప్ షికార్ చేస్తోంది. అయితే ఈపాటికే ఈ సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తి చేసేసాడు మురుగదాస్. ఒక వైపు నిర్మాణానంతర పనుల్ని మొదలు పెడుతున్నాడని తెలిసింది. అయితే ఇలాంటి సమయంలో సినిమా ఆగిపోయింది! అనే పుకార్ పుట్టుకొచ్చింది. నిజానికి అంత పెద్ద సినిమా, భారీ మొత్తాలను వెచ్చించి సాహసాలు చేస్తున్న నిర్మాతలకు ఎలా ఉంటుంది?
ఇలాంటి అయోమయ గందరగోళ సన్నివేశాన్ని సృష్టించడం ద్వారా మురుగదాస్ సినిమాకి నష్టం చేకూర్చాలని భావిస్తున్నారు. ఇది ఒక సెక్షన్ ఆడియెన్ లో భయాందోళనలు కలిగించడమేనని కూడా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఒక సౌత్ దర్శకుడి సినిమాపై నెగెటివ్ గా ప్రచారం సాగడం గతంలో కూడా ఉంది. ఇప్పటికీ ఉత్తరాదిన ఈ తరహా ప్రచారం ఉంటుంది. అయినా అన్నిటినీ అధిగమించి మురుగదాస్ భారీ యాక్షన్ చిత్రంతో విజయం సాధించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఒక సౌత్ దర్శకుడు అయినా కానీ మరుగదాస్ కి సల్మాన్ చాలా అండగా నిలబడుతున్నారు. అయితే తనను నమ్మినందుకు సల్మాన్ భాయ్ కి అదిరిపోయే హిట్టివ్వాల్సిన బాధ్యత కూడా మురుగదాస్ పై ఉంది. ఈద్ కానుకగా సల్మాన్- రష్మిక మందన్న నటించిన సికందర్ విడుదలకు సిద్ధమవుతోంది.