Begin typing your search above and press return to search.

ఆమెకు లేని ఇబ్బంది మీకేంటి? ఏజ్ గ్యాప్ పై స‌ల్మాన్

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోహీరోయిన్ల విష‌యంలో ఎప్పుడూ ఏదొక చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   24 March 2025 12:19 PM IST
Salman Khan Rashmika Age Gap
X

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోహీరోయిన్ల విష‌యంలో ఎప్పుడూ ఏదొక చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. ఒక‌సారి ఫ‌లానా జంట మ‌ధ్య బాగా కెమిస్ట్రీ కుదిరింద‌ని, మ‌రోసారి వారిద్ద‌రి జంట అస‌లు బాలేద‌ని, ఇంకోసారి హీరోహీరోయిన్ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఉంద‌ని సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్స్ జ‌రుగుతూనే ఉంటాయి. ఈ డిస్క‌ష‌న్స్ కొత్తేమీ కాదు.

టాలీవుడ్ లో ఈ విష‌యంపై చాలామందిని విమ‌ర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, విక్ట‌రీ వెంక‌టేష్, నంద‌మూరి బాల‌కృష్ణ‌, ర‌వితేజ పేర్లు ఈ మ‌ధ్య ఈ డిస్క‌ష‌న్స్ లో బాగా వినిపించాయి. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ ఉంది. హీరోలు త‌మ కంటే బాగా చిన్న‌వాళ్లైన హీరోయిన్ల‌తో రొమాన్స్ చేయ‌డాన్ని ఆడియ‌న్స్ విర్శిస్తున్నారు.

ఇప్పుడిదే విమ‌ర్శ బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కు ఎదురైంది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సికింద‌ర్ అనే సినిమా వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. మార్చి 30న సికింద‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ర‌ష్మికకు, త‌నకు మ‌ధ్య ఉన్న ఏజ్ గ్యాప్ పై వ‌స్తున్న క్రిటిసిజంపై స‌ల్మాన్ స్పందించాడు.

సినిమాలో ర‌ష్మిక‌తో తాను క‌లిసి న‌టించ‌డంలో అంద‌రికీ ఉన్న స‌మ‌స్యేంటో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంద‌ని నాకు తెలుసు, ర‌ష్మికకు తెలుసు. ఈ విష‌యంలో హీరోయిన్ అయిన ర‌ష్మిక‌కు ఎలాంటి ప్రాబ్ల‌మ్ లేదు, త‌న తండ్రికి ఎలాంటి స‌మ‌స్యా లేదు. త్వ‌ర‌లోనే ర‌ష్మిక పెళ్లి చేసుకుని ఒక కూతురిని కంటే ఆమె పెద్ద‌య్యాక ఆమెతో కూడా క‌లిసి వ‌ర్క్ చేస్తాను. ర‌ష్మిక కూడా దానికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నా అని స‌ల్మాన్ అన‌గా, అందుకు ర‌ష్మిక న‌వ్వుతూ ఆయ‌న చెప్పిన విష‌యాన్ని అంగీక‌రించింది.

నిజం చెప్పాలంటే ఇండ‌స్ట్రీలో హీరోల‌కు ఉన్నంత లైఫ్ టైమ్ హీరోయిన్ల‌కు ఉండ‌దు. హీరోయిన్ల హ‌వా వాళ్ల‌కి ఒక వ‌య‌సు వ‌చ్చేవ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది. కానీ హీరోల విష‌యం అలా కాదు. హీరోలు 60ల్లోకి వ‌చ్చాక కూడా సినిమాలు చేస్తుంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ఎగ‌బ‌డ‌తారు. అందుకే హీరోయిన్లు క్రేజ్ ఉన్న‌ప్పుడే వ‌చ్చిన అవ‌కాశాల‌ను వినియోగించుకుంటూ ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా స్టార్ హీరోల‌తో న‌టించడానికి ఒప్పుకుంటారు.