Begin typing your search above and press return to search.

సెట్ అయితే చ‌రిత్ర‌లో నిలిచిపోతారు!

సూప‌ర్ స్టార్- స‌ల్మాన్ ఖాన్ సినిమా చేస్తే మాత్రం రిలీజ్ కి ముందే పెద్ద సంచ‌ల‌న‌మ‌వుతుంది. ఆ కాంబినేష‌న్ చేతులు క‌ల‌పాలని అభిమానులు కోరుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 5:49 AM GMT
సెట్ అయితే చ‌రిత్ర‌లో నిలిచిపోతారు!
X

అట్లీ ప్రాజెక్ట్ నుంచి బ‌న్నీ ఎగ్జిట్ అయిన త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ వ‌చ్చి చేరిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇది బ‌న్నీ కోసం రాసుకున్న క‌థ‌నా? ఖాన్ సాబ్ కోసం ప్ర‌త్యేకంగా రాసుకున్న స్టోరీనా? అన్న‌ది తెలియ‌దు గానీ! ఇద్దరి కాంబినేష‌న్ లో సినిమా అనేస‌రికి అంచ‌నాలు మాత్రం పీక్స్ కి చేరాయి. ఇప్పుడా అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు చేస్తూ అట్లీ దీన్ని పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్ గా మార్చే ప‌నిలో ప‌డ్డాడు.

బాలీవుడ్ నుంచి స‌ల్మాన్ ఖాన్ లాక్ అయిన నేప‌థ్యంలో సౌత్ నుంచి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అట్లీ-ర‌జ‌నీకాంత్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతు న్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇదే భారీ మ‌ల్టీస్టార‌ర్ అవుతుంది. నార్త్ బెల్ట్ నుంచి సునాయాసంగా 500 కోట్లు తేగ‌ల స్టార్ స‌ల్మాన్.

సౌత్ నుంచి సూప‌ర్ స్టార్ 500 కోట్లు తేగ‌ల‌రు. వారిద్ద‌రు క‌లిస్తే పాన్ ఇండియా వైడ్ ఎంత సంచ‌ల‌నమ వుతుందో ఇంత‌కు మించి చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే అట్లీ ప్ర‌పోజ‌ల్ ని సూప‌ర్ స్టార్ అంగీక‌రిస్తారా? అన్న‌ది స‌స్పెన్స్. సూప‌ర్ స్టార్ గా ఎదిగిన త‌ర్వాత ర‌జ‌నీకాంత్ ఇత‌ర హీరోల‌తో క‌లిసి ప‌నిచేయ‌లేదు. సోలోగానే సినిమాలు చేసారు. పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ వ‌ర‌కూ సోలోగానే రీచ్ అయ్యారు.

అలాంటి ర‌జ‌నీని ఇప్పుడు మ‌రో స్టార్ తో క‌లిసి సినిమా చేయ‌డం అంటే చాలా విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత‌వ‌ర‌కూ ర‌జనీ సినిమాలో చాలా మంది స్టార్లు తోడ‌య్యారు. త‌ప్ప ఆయ‌న ఎవ‌రి సినిమాలో గెస్ట్ రోల్ కూడా పోషించ‌లేదు. వాస్త‌వానికి ఏ ద‌ర్శ‌కుడు కూడా ర‌జ‌నీతో అలా ప్లాన్ కూడా చేయ‌లేదు. తొలిసారి ఆ ఛాన్స్ అట్లీ తీసుకుంటున్నాడు. మ‌రి ఈ ప్లాన్ ఎంత వ‌ర‌కూ ఎగ్జిక్యూట్ చేస్తాడు? అన్న‌ది చూడాలి.

సూప‌ర్ స్టార్- స‌ల్మాన్ ఖాన్ సినిమా చేస్తే మాత్రం రిలీజ్ కి ముందే పెద్ద సంచ‌ల‌న‌మ‌వుతుంది. ఆ కాంబినేష‌న్ చేతులు క‌ల‌పాలని అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రేం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించ‌డానికి రెడీగా ఉంది. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు.