Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ రీమేక్ కి రెడీ అయిన స్టార్ హీరో!

బాలీవుడ్ సంల‌చ‌న చిత్రం` షోలే` గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 10:25 AM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ రీమేక్ కి రెడీ అయిన స్టార్ హీరో!
X

బాలీవుడ్ సంల‌చ‌న చిత్రం` షోలే` గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ మూవీగా నిలిచింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ వ‌సూళ్లు సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది. ధ‌ర్మేంద్ర‌, అమితాబ‌చ్చ‌న్, సంజీవ్ క‌పూర్, హేమామాలిని , జ‌యాబ‌చ్చ‌న్, అంజ‌ద్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ర‌మేష్ సిప్పీ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈసినిమా విజ‌యంతో అందులో న‌టించిన న‌టీనటు లంద‌రూ అప్ప‌ట్లో ఓ వెలుగు వెలిగారు.


హీరోల‌గా మ‌రింత బిజీ అయ్యారు. వాళ్లంద‌రి కెరీర్ లోనూ ఈ సినిమా ఓ మైల్ స్టోన్ లా నిలిచిపోయింది. ముఖ్యంగా అమితాబ్ కి మ‌రింతగా హైలైట్ చేసిన చిత్రంగా నిలిచింది. హిందీలో రిలీజ్ అయినా పాన్ ఇండియా వైడ్ అమితాబ్ కి పేరు తీసుకొచ్చిన చిత్రంగా షోలోని చెప్పొచ్చు. షోలో త‌ర‌హా మ‌రో సినిమా చేయాల‌ని త‌ర్వాత కాలంలో కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి గానీ, ఆరేంజ్ విజ‌యం సాధ్య‌ప‌డ‌లేదు.

తాజాగా స‌ల్మాన్ ఖాన్ షోలో రీమేక్ లో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాడు. యాంగ్రీ యంగ్ మెన్ ప్ర‌మోష‌న్ లో స‌ల్మాన్ ఈ వ్యాఖ్య‌లు చేసాడు. షోలే లో జైదేవ్ -గ‌బ్బ‌ర్ పాత్ర‌ల్లో ఏదైనా ఒకే అంటూ ముందు కొచ్చాడు. అంజ‌ద్ ఖాన్ గ‌బ్బ‌ర్ సింగ్ పాత్ర‌లో, జైదేవ్ పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టించారు. ఈ రెండు పాత్ర‌లు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అందుకే స‌ల్మాన్ ఆ రెండు పాత్ర‌ల్లో ఒక‌టి ఛాయిస్ గా తీసుకున్నాడు.

మ‌రి `షోలే`ని రీమేక్ చేసే సాహ‌సం నేటి జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కులు ఎవ‌రైనా చేస్తారా? అన్న‌ది చూడాలి. అలాంటి యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ చిత్రాన్ని ట‌చ్ చేయాలంటే ఆ జానర్ చిత్రాల‌పై మంచి ప‌ట్టు ఉండాలి. అలాగ‌ని ర‌మేష్ సిప్పీ ఇప్పుడా సాహ‌సం చేయ‌లేరు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 77. స‌హ‌క‌రించ‌డం క‌ష్టం. నాలుగేళ్ల క్రితం నుంచి ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. చివ‌రిగా ఆయ‌న 2020 లో శిమ్లా మిర్చీ తెర‌కెక్కించారు.