ట్రోల్స్ : వీడియో తీస్తే ఏమైంది భయ్యా?
అలాంటిది ఒక ఫ్యాన్ దూరంగా ఉండి వీడియో తీసుకుంటూ ఉన్నా సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
By: Tupaki Desk | 8 March 2024 1:30 PM GMTసెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అభిమానులతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక స్టార్స్, సూపర్ స్టార్స్ కనిపిస్తే చాలు ఎగబడి ఫోటోలు వీడియోలు తీసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అలాంటిది ఒక ఫ్యాన్ దూరంగా ఉండి వీడియో తీసుకుంటూ ఉన్నా సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్ట్ లో సల్మాన్ ఖాన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. సల్మాన్ కి దూరంగానే ఒక అభిమాని సెల్ఫీ వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఫ్యాన్ సల్మాన్ కి అడ్డు రావడం కానీ, ఆపడం కానీ చేయలేదు.
అయినా కూడా ఫ్యాన్ ను వీడియో తీస్తున్నందుకు సల్మాన్ ఖాన్ తిడుతూ ఆపేయమని హెచ్చరించాడు. దాంతో ఆ ఫ్యాన్ తాను తీసుకుంటున్న వీడియోను ఆపేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో చాలా మంది సల్మాన్ ఖాన్ ను ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సాలిడ్ సక్సెస్ లేక పోవడంతో సల్మాన్ కాస్త ఫ్రస్టేషన్ లో ఉన్నట్లుగా అనిపిస్తున్నాడు. ఆయన కాస్త కూల్ అయితే బాగుంటుంది. ఫ్యాన్స్ తో సాఫ్ట్ గా ఉండాలని చాలా మంది సల్మాన్ ఖాన్ కి సూచిస్తున్నారు.
ఆ ఫ్యాన్ నీకు చాలా దూరంగానే ఉన్నాడు, నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుంటానే వీడియో తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు నీకు కలిగిన ఇబ్బంది ఏంటి భయ్యా అంటూ కొందరు సల్మాన్ ను ట్రోల్స్ చేస్తూ ఉంటే.. మరి కొందరు ప్రైవసీ అనేది ఒకటి ఉండాలి కదా అంటూ సల్మాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి...?