Begin typing your search above and press return to search.

పెళ్లాడ‌తావా చ‌స్తావా? స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో యువ‌తి ర‌చ్చ‌!

స‌ల్మాన్ ఖాన్ బాంద్రా ఇంటిపై తుపాకీ దాడుల అనంత‌రం ముంబైలో ఒక్కో ప‌రిణామం సినిమాటిక్ ట‌ర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Jun 2024 6:56 PM GMT
పెళ్లాడ‌తావా చ‌స్తావా? స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో యువ‌తి ర‌చ్చ‌!
X

స‌ల్మాన్ ఖాన్ బాంద్రా ఇంటిపై తుపాకీ దాడుల అనంత‌రం ముంబైలో ఒక్కో ప‌రిణామం సినిమాటిక్ ట‌ర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ముంబై ఔట‌ర్ లోని పన్వేల్ ఫామ్ హౌస్‌లో సల్మాన్‌ఖాన్‌పై దాడికి కుట్ర పన్నినందుకు గాను లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు త‌న‌ను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇదే ఫామ్‌హౌస్ వెలుపల తిరుగుతున్న ఢిల్లీకి చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాతీయ మీడియా తాజా నివేదిక ప్రకారం.. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువ‌తి తనను తాను సల్మాన్ ఖాన్ కి వీరాభిమానిని అని చెప్పుకుంది. పన్వెల్ తాలూకాలోని అతడి ఫామ్‌హౌస్ వెలుపల అతడిని కలవాలని డిమాండ్ చేసింది. సల్మాన్ ఫామ్ హౌస్‌లో లేనప్పటికీ యువ‌తి వీరంగం పిచ్చి లేపింది. దీంతో గ్రామస్థులు వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు.

తాను సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆ యువ‌తి ప‌దే ప‌దే వ‌ల్లిస్తూనే ఉంద‌ని స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటికే పన్వేల్ తాలూకా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తదుపరి కౌన్సెలింగ్ కోసం సోషల్ అండ్ ఎవాంజెలికల్ అసోసియేషన్ ఫర్ లవ్ (సీల్) అనే NGOకి తీసుకెళ్లారు. మానసిక చికిత్స కోసం ఆమెను కలాంబోలిలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారని, ఆమె తల్లిని ఢిల్లీ నుంచి పిలిపించారని కూడా తెలిసింది. సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒంటరిగా ఢిల్లీ నుంచి నవీ ముంబైకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎనిమిది రోజుల చికిత్స కౌన్సెలింగ్ తర్వాత, మహిళను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. సల్మాన్ ని ఘాడంగా ప్రేమించిన‌ ఆ యువ‌తి మాన‌సిక ప‌రిస్థితి తీవ్రంగా అదుపుత‌ప్పింద‌ని కూడా చెబుతున్నారు.

కాగా బిష్ణోయ్ కేసులో అరెస్టయిన నిందితులను ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్‌లుగా గుర్తించారు. నిందితుల వివ‌రాల ప్ర‌కారం.. లారెన్స్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా ముఠాలోని 60 నుండి 70 మంది సభ్యులు సల్మాన్ ఖాన్‌పై నిఘా ఉంచడానికి ముంబై, రాయగడ్, నవీ ముంబై, థానే, పూణే, గుజరాత్ నుండి వచ్చారు. మైనర్లను ఉపయోగించి అతడిపై దాడి చేయాలని ప్లాన్ చేశారు. దాడి అనంతరం నిందితులు కన్యాకుమారి నుంచి పడవలో శ్రీలంకకు పారిపోవాలనుకున్నారు.