సింగిల్ బెడ్‌రూమ్‌లో సింగిల్‌గా ఉంటున్న సూపర్ స్టార్!
ఇంతకీ మనం ఏ స్టార్ హీరో గురించి మాట్లాడుతున్నామో ఈపాటికే అవగతమై ఉంటుంది
By: Tupaki Desk | 15 April 2024 5:10 AM GMTవేల కోట్ల నికర ఆస్తులు.. నెలకు కోట్లలో భారీ ఆదాయాలు.. లెక్కకుమించిన సొంత అపార్ట్ మెంట్లు.. కానీ ఎన్ని ఉన్నా ఈ స్టార్ హీరో ఒక సింగిల్ బెడ్ రూమ్ లో నివశిస్తున్నాడు. అతడి సింప్లిసిటీ ఎలాంటిదో.. ఇప్పుడు తన ఫ్లాట్ వెలుపల గ్యాంగ్ స్టర్స్ కాల్పుల కలకలం తర్వాత బయటపడింది. ఇంతకీ మనం ఏ స్టార్ హీరో గురించి మాట్లాడుతున్నామో ఈపాటికే అవగతమై ఉంటుంది.
అవును.. అతడు ది గ్రేట్ సల్మాన్ ఖాన్. 2200 కోట్ల రూపాయల నికర ఆస్తులు .. రూ. 16 కోట్ల నెలవారీ ఆదాయంతో భారతదేశపు అత్యంత సంపన్న నటుల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో నిరాడంబరంగా జీవిస్తాడు. అతడు సింపుల్ గా 1 BHK అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అపారమైన సంపదలు ఉన్నా కానీ భాయిజాన్ ఇలా ఉండటానికి కారణమేమిటి? అంటే.. తన బలమైన కుటుంబ బంధాలు సామాజిక జీవనం కారణంగా ఈ సింపుల్ సింగిల్ బెడ్ రూమ్‌ని ఎంచుకున్నాడు.
సల్మాన్ తన తల్లిదండ్రులు ఉండే చోటనే ఉంటాడు. ఒకే భవంతిలోని వేర్వేరు ఫ్లాట్లలో వీరంతా నివశిస్తారు. సల్మాన్ తల్లిదండ్రులు మొదటి అంతస్తులో నివసిస్తుండగా, సల్మాన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఇందులో ఒకే ఒక్క సోఫా రెండు కుర్చీలు పడతాయి. ఈ చిన్న ప్రదేశంలో ఉండాలనే అతడి నిర్ణయం వెనక అసలు కారణం తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే అతని కోరిక.
చాలా మంది బడా స్టార్లు పెళ్లయాక సొంత గూటికి ఎగిరిపోయారు. ఖరీదైన విలాసవంతమైన ఇండ్లలోకి మారారు. ఆలి కోసమే అనుబంధాలను వదులుకున్నవారు ఉన్నారు. కానీ సల్మాన్ అలా కాదు. తాను బ్యాచిలర్ గా ఉన్నా పెళ్లయినా తల్లిదండ్రులతోనే ఉండాలనుకుంటాడు. కానీ అతడు ఎప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నాడు.
సల్మాన్ ఖాన్ ఎప్పుడూ గొప్ప భవనం కంటే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లను ఇష్టపడటానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూఓ నిజాయితీగా వెల్లడించాడు. చిన్ననాటి జ్ఞాపకాలు..గేలాక్సీలోని ఇతర నివాసితులతో అనుబంధం ..నేచురల్ లివింగ్ తనకు నచ్చుతుంది. తనకు సమాజికంగా కలిసి ఉండాలనే భావం మెండుగా ఉండటం కూడా తన నిర్ణయానికి ఒక కారణం. ఇలాంటి చాలా కారణాలతో గేలాక్సీ భవనంపై తనకున్న ఘాఢమైన ప్రేమను వదులుకోలేడు. ''నా తల్లిదండ్రులు నా పైన ఉన్న ఫ్లాట్‌లో నివసిస్తున్నందున బాంద్రాలోని ఇదే చోట ఉండడం నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి నేను అదే ఎడమ మలుపు లేదా కుడి మలుపు తీసుకున్నాను. నాకు వేరే మార్గం లేదు'' అని భాయిజాన్ ఛమత్కరించాడు.
''ఆ భవనం మొత్తం ఒక పెద్ద కుటుంబంలా ఉంది. మేం చిన్నప్పుడు, భవనంలోని పిల్లలంతా కలిసి దిగువ తోటలో ఆడుకునేవాళ్లం. కొన్నిసార్లు అక్కడే పడుకునేవాళ్లం కూడా. అప్పట్లో వేర్వేరు ఇళ్లు ఉండేవి కావు. అన్ని ఇళ్లు మా సొంతం అని భావించి ఎవరి ఇంట్లోకి అయినా వెళ్లిపోయి భోజనం చేసేవాళ్లం. నేను ఇప్పటికీ అదే ఫ్లాట్‌లో ఉన్నాను. ఎందుకంటే ఆ ఇంటితో నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి'' అన్నారు సల్మాన్. అతడికి గొప్ప కీర్తి సిరిసంపదలు ఉన్నా కానీ.. సల్మాన్ ఖాన్ తన నిరాడంబరమైన ఇంటిలోని సింప్లిసిటీ, గొప్ప అనుబంధాలు, పరిచయాలలోనే ఓదార్పు, ఆనందాన్ని పొందుతాడు.
వృత్తిపరంగా చూస్తే.. సల్మాన్ ఖాన్ తదుపరి AR మురుగదాస్ దర్శకత్వంలో 'సికందర్'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాత. ఈద్ 2025న థియేటర్లలో విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ ఏప్రిల్ 11న ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా టైటిల్‌ను ప్రకటించి పోస్టర్‌ను షేర్ చేశాడు.