మైనర్ బాలుడితో సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి
By: Tupaki Desk | 2 July 2024 7:25 AM GMTబాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నాటి నుంచి కేసు విచారణ వరకూ మొత్తం 350 పేజీల చార్జ్ షీట్ లో కీలక అంశాలు ప్రస్తావించారు. అచ్చంగా పంజాబీ సింగర్ సిద్దూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ ఖాన్ చంపేందుకు కుట్రపన్నినట్లు పోలీసులు గుర్తించారు. అందుకోసం మైనర్లను షార్పు షూటర్లగా గ్యాంగ్ రంగంలోకి దించింది.
సల్మాన్ ఖాన్ తరుచూ రాకపోకలు చేస్తోన్న సినిమా షూట్ స్పాట్ లేదా? పన్వేల్ ఫామ్ హౌస్ లో హత్యకు ప్లాన్ చేసారు. అందుకు గాను 25 లక్షల కాంట్రాక్ట్ కుదిరింది. ఈ ప్లాన్ అంతా 2023 ఆగస్టు నుంచి 2024 మధ్య రూపొందించారు. టర్కీ నుంచి జిగాన పిస్టోళ్లను కూడా తెప్పించేందుకు పథకం వేసారు. సిద్దూ మూసేవాలా , గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హత్యల్లో ఇవే తుపాకులు వాడారు. ఇవి భారత్ లో నిషేధం. ఈ తుపాకుల నకళ్లను పాకిస్తాన్ తయారు చేస్తోంది.
అసలు తుపాకుల క్వాలిటీతోనే ఇవి ఉంటాయి. నకళ్లు కావడంతో తక్కువ ధరకు లభిస్తాయి. ఇంకా పాకిస్తాన్ నుంచి మరికొన్ని ఆయుధాల్ని కూడా రెడీ చేసుకున్నారు. ఈ కుట్రను అమలు చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ 60-70 మందితో ఓ నెట్ వర్క్ ని ఏర్పాటు చేసారు. వీరంతా సల్మాన్ కదలికలపై నిఘా పెట్టారు. ముంబై సహా పూణే, రాయ్ ఘడ్, గుజరాత్ లో రెక్కీ వేసారు. హత్య చేయడానికి 18 ఏళ్ల లోపు మైనర్లను ఎంచుకున్నారు. వారంతా కూడా బాస్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు.
హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంక పారిపోయేలా ప్రణాళిక సిద్దమైంది. పన్వేల్ ఇన్ స్పెక్టర్ నితిన్ ఠాక్రేకు ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ ఇంటిలిజెన్స్ టిప్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్ సభ్యులకు సల్మాన్ ని చంపేదుకు 25 లక్షలు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ గ్యాంగ్ అంతా వాట్సాప్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు కమ్యునికేట్ అవుతూ టచ్ లో ఉన్నారు. ముఖ్యగా 15 మందితో గ్రూప్ ఏర్పాటైంది. ఈ లీకుతో తీగ పట్టుకుని లాగితే ఢొంకంతా కదిలినట్లు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.