Begin typing your search above and press return to search.

వార్ 2 ప‌ఠాన్ 2లో స‌ల్మాన్ ZERO అట‌

టైగర్ విషయంలో ఆదిత్య చోప్రా, సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారనేది తాజా స‌మాచారం.

By:  Tupaki Desk   |   14 March 2024 12:30 PM GMT
వార్ 2 ప‌ఠాన్ 2లో స‌ల్మాన్ ZERO అట‌
X

ఏక్ థా టైగర్ - టైగర్ జిందా హై విజయాలతో YRF స్పై యూనివర్స్‌ను ప్రారంభించాడు స‌ల్మాన్. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్‌లో వార్ 2, పఠాన్ 2, పఠాన్ Vs టైగర్, మహిళా గూఢచారి చిత్రం క్యూలో ఉన్నాయి. ప్ర‌తిష్ఠాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకదానిని నిర్మించింది. అయితే టైగర్ అకా సూపర్ గూఢచారి అవినాష్ సింగ్ రాథోడ్ (స‌ల్మాన్ ఖాన్)ని త‌దుప‌రి రానున్న సీక్వెల్స్ లో అభిమానులు చూడలేరనేది నిరాశ‌ప‌రుస్తోంది. ప్రొడక్షన్ హౌస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టైగర్ విషయంలో ఆదిత్య చోప్రా, సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారనేది తాజా స‌మాచారం. దీన‌ర్థం.. పఠాన్ 2 - వార్ 2 వంటి హై-ఆక్టేన్ చిత్రాలలో సూపర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ అతిధి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణ‌యించుకున్నారు. ఆదిత్య చోప్రాతో చ‌ర్చించాక‌ పరస్పర నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎందుకీ స‌డెన్ నిర్ణ‌యం అంటే దానికి కార‌ణం కూడా ఉంది.

సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర `పఠాన్`లో వ‌ర్క‌వుటైంది. ఈ సినిమా హైలైట్లలో ఈ పాత్ర‌ ఒకటి. పఠాన్ (షారూఖ్ ఖాన్) రష్యన్‌లతో హోరాహోరీకి దిగినప్పుడు టైగర్ అద్భుతంగా ఎంట్రీ ఇచ్చాడు. స‌ల్మాన్ భాయ్ ఇప్పటి వరకు నాలుగు స్పై యూనివర్స్ చిత్రాలలో నటించాడు. ప్ర‌తిదీ స‌క్సెసయ్యాయి. ఇక టైగ‌ర్ 3లో షారూఖ్ అతిథి పాత్ర ఈ సినిమాకి క‌లిసి రాక‌పోవ‌డం కూడా కొంత ఆలోచింప‌జేసింద‌నే గుస‌గుస వినిపిస్తోంది.

అందుకే త‌దుప‌రి ఫ్రాంఛైజీ చిత్రాల్లో క‌నిపించాలంటే ఒక పెద్ద స్టార్ కి త‌గ్గ‌ట్టు స్టాండార్డ్స్ అద్భుతంగా ఉంటేనే వ‌ర్క‌వుట‌వుతుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. అభిమానులు టైగర్‌ను ఎక్కువ‌గా చూసేశారని.. అత‌డి తదుపరి పునరాగమనం `అత్యంత కీలకమైనది`గా.. అద్భుతమైనదిగా ఉండాలని YRF బృందం భావిస్తోంది.

వ‌రుస చిత్రాల్లో యాధృచ్ఛికంగా అతిధి పాత్రలు ఉండటం వల్ల టైగర్‌లోని ఒక స్టాండ్ ఎలోన్ క్యారెక్టర్‌ని పలుచన చేస్తుంది. టైగర్ కోసం పెద్ద ప్లాన్ అవ‌స‌ర‌మ‌ని సల్మాన్ ఖాన్‌తో ఆదిత్య‌ చర్చించాడు. అత‌డు కూడా అదే ఆలోచ‌న‌లో ఉన్నాడు... అని చెబుతున్నారు.

అతిధి పాత్రలతో అలసిపోయిన భాయ్

సల్మాన్ ఖాన్ అలాంటి అతిథి పాత్రలు చేయడంలో విసిగిపోయాడని .. వంద‌శాతం గ్రిప్పింగ్ పాత్రలపై మాత్రమే దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆదిత్య చోప్రా గూఢచారి చిత్రాలకు టైమ్‌లైన్‌ని సెట్ చేయాలనుకుంటున్నారు. తద్వారా ప్రజలను వాటికి కనెక్ట్ చేయవచ్చు. అతడు (టైగ‌ర్) సాదా జిమ్మిక్ ప్రదర్శనలను కోరుకోడు. అత్యంత అనూహ్య రీతిలో టైగర్ తిరిగి రావడం కోసం జాగ్రత్త వహించాల‌నేదే ముఖ్య ఉద్ధేశం అని సోర్స్ చెబుతోంది.

1980లలో మాల్దీవుల్లో జరిగిన భారత సైనిక తిరుగుబాటు కథాంశంతో తెరకెక్కిన చిత్రం ది బుల్ లో స‌ల్మాన్ న‌టిస్తున్నాడు. విష్ణువర్ధన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి భాయ్ ప్రిపేర్ అవుతున్నాడు. గజిని ఫేమ్ ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న త‌దుప‌రి చిత్రంలో స‌ల్మాన్ న‌టిస్తారు. 2025 ఈద్ కి దీనిని రిలీజ్ చేయాల‌నేది ప్లాన్.