Begin typing your search above and press return to search.

హిట్ ప్రాంచైజీకి సీక్వెల్-ఇది పార్ట్-4!

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న ఈ విష‌యాన్ని రివీల్ చేసారు.' ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్దంగా ఉంది. ఇందులో న‌ట‌న‌టులు కొత్త వాళ్లు ఉంటారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 10:30 AM GMT
హిట్ ప్రాంచైజీకి సీక్వెల్-ఇది పార్ట్-4!
X

బాలీవుడ్ లో 'రేస్' ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌రూ రిలీజ్ అయిన మూడు భాగాలు బంపర్ హిట్టు అందుకున్నాయి. దీంతో రేస్ ప్రాంచైజీ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయింది. యాక్ష‌న్ ప్రియుల్ని అత్యద్భుతంగా అల‌రించిన చిత్ర‌మిది. మొద‌టి రెండు భాగాల‌కు అబ్బాస్ మ‌స్తాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మూడ‌వ భాగాన్ని మాత్రం రొమోయో డిసౌజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ద‌ర్శ‌కుడు మారినా సినిమాలో వేవ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆ సినిమాల విజ‌యంతో వాళ్ల‌కు మంచి పేరొచ్చింది. ఇక మూడ‌వ భాగంలో స‌ల్మాన్ తో పాటు అనీల్ క‌పూర్, బాబి డియోల్, జాక్వెలిన్ పెర్నాండేజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్ష‌మే కురిపించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా హిట్ ప్రాంచైజీకి నాల్గ‌వ భాగాన్ని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌మేష్ త‌రానీ ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న ఈ విష‌యాన్ని రివీల్ చేసారు.' ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్దంగా ఉంది. ఇందులో న‌ట‌న‌టులు కొత్త వాళ్లు ఉంటారు. స‌ల్మాన్ ఖాన్ ఇందులో భాగ‌మ‌వుతాడా? లేదా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేను. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంది. ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది కూడా ఇంకా నిర్ణ‌యించ‌లేదు' అని అన్నారు.

దీంతో స‌ల్మాన్ ఎంట్రీ ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే. మిగ‌తా కీల‌క పాత్ర‌ల‌కు కొత్త కుర్రా ళ్ల‌ను ఎంపిక చేసే అవకాశం క‌నిపిస్తుంది. సీనియ‌ర్ల‌కంటే కార్తీక్ ఆర్య‌న్ లాంటి యంగ్ హీరోలో భాగ‌మైతే క‌థ‌కి కొత్త ఫీల్ దొరుకుతుంది. ఈ మ‌ధ్య బాలీవుడ్ లో కొత్త వాళ్లు బాగా స‌క్సెస్ అవుతున్నారు. వెబ్ సిరీస్ ..ఓటీటీ కంటెంట్ ద్వారా మార్కెట్ లోకి వ‌స్తున్న వారికి ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ద‌క్కుతుంది. అందుకే ప్రాజెక్ట్ లో చాలా మార్పులే చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడి విష‌యంలోనూ చాలా మార్పులే క‌నిపించే అవ‌కాశం ఉంది. మ‌రేం జ‌రుగుతుంది? అన్న‌ది చూడాలి.