Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: భాయ్‌ని భయపెట్టాలని షూటర్లకు ఆదేశాలు

అన్మోల్ బిష్ణోయ్ షూటర్ విక్కీకుమార్ గుప్తా మధ్య సంభాషణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 July 2024 10:54 AM GMT
సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: భాయ్‌ని భయపెట్టాలని షూటర్లకు ఆదేశాలు
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంద్రా అపార్ట్‌మెంట్ వెలుపల జరిగిన కాల్పుల ఘటనపై ముంబై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్, బాలీవుడ్ సూపర్ స్టార్ స‌ల్మాన్‌ను భయపెట్టేందుకు గాల్లోకి కాల్పులు జరపాలని గన్‌మ్యాన్‌ను ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది.

ముంబైలో బిష్ణోయ్ ముఠా ఆధిపత్యాన్ని చాటుకునే వ్యూహంలో ఇదంతా ఒక‌ భాగమని, ఆర్థికంగా అలాగే ఇతర ప్రయోజనాలను పొందడమే లక్ష్యంగా బిష్ణోయ్ గ్యాంగ్ ఈ బెదిరింపు ప్లాన్ చేసింద‌ని దర్యాప్తు సంస్థ పేర్కొంది. హిందూస్తాన్ టైమ్స్ వివ‌రాల‌ ప్రకారం.. ఛార్జిషీట్ ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కోర్టుకు సమర్పించారు. అన్మోల్ బిష్ణోయ్ షూటర్ విక్కీకుమార్ గుప్తా మధ్య సంభాషణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఖాన్‌ను భయపెట్టేందుకు ఉద్దేశించిన రీతిలో షాట్‌లు కాల్చమని అన్మోల్ గుప్తాకు సూచించాడని సీసీటీవీ ఫుటేజీలో నిర్భయంగా క‌నిపించాల‌ని గ‌న్ ఫైరింగ్ సమయంలో గుప్తా పొగ తాగాలని రింగు రింగులుగా గాల్లోకి పొగ వ‌ద‌లాల‌ని సూచించాడని ఆరోపించారు.

మీరు ఈ పని చేస్తే చరిత్ర సృష్టిస్తారు. మీ పేరు అన్ని వార్తాపత్రికలు స‌హా ఇతర మీడియాలో హైలైట్ అవుతుంది! అని 1,735 పేజీల ఛార్జిషీట్‌లోని గ్యాంగ్ స్ట‌ర్ సంభాషణను ద‌ర్యాప్తు బృందం ప్రస్తావించింది. సల్మాన్ ఖాన్ ప్రకటనను కూడా ఛార్జిషీట్‌లో చేర్చారు. ఏప్రిల్ 14 తెల్లవారుజామున గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో నిద్రిస్తున్నప్పుడు, తాను బాణసంచా వంటి శబ్దం విన్నాన‌ని తెలిపారు. మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మొదటి అంతస్తులోని బాల్కనీలో కాల్పులు జరిపారని.. అతని అంగరక్షకుడు(పోలీస్) ఉదయం 4:55 గంటలకు త‌న‌కు సమాచారం అందించాడని కూడా స‌ల్మాన్ వెల్ల‌డించారు.

ఈ ఘ‌ట‌న‌లో కాల్పులు జరిపినట్లు అంగీకరించిన అన్మోల్ బిష్ణోయ్ కెనడాలో నివసిస్తున్నారు. అయితే ముంబై పోలీసు అధికారి వివ‌రాల‌ ప్రకారం.. అతడు అంగీకరించిన ఫేస్‌బుక్ పోస్ట్ IP చిరునామా పోర్చుగల్‌కు చెందినది. పోలీసులు అతడి కోసం లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావిస్తూ.. సల్మాన్ తన ప్రకటనలో ఇంకా ఇలా అన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ తన ముఠా సభ్యుల సహాయంతో కాల్పులు జరిపాడని నేను నమ్ముతున్నాను. నా కుటుంబ సభ్యులు నిద్రపోతున్నారు. వారు నన్ను, నా కుటుంబ సభ్యులను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని స‌ల్మాన్ ఆరోపించిన‌ట్టు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.