Begin typing your search above and press return to search.

సికందర్ ట్రెండ్ చూసి మేకర్స్ షాక్..?

పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్న టైం లో బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ మేకర్స్ మీద దృష్టి పెట్టారు

By:  Tupaki Desk   |   20 Jun 2024 2:30 PM GMT
సికందర్ ట్రెండ్ చూసి మేకర్స్ షాక్..?
X

పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్న టైం లో బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ మేకర్స్ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ అంతా ఆసక్తి చూపిస్తుంటే ఆల్రెడీ కమిటైన హిందీ హీరోల సినిమాలపై సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ బాలీవుడ్ యాక్షన్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో సికందర్ అనే సినిమా లాక్ అయ్యింది. తమిళంలో శివకార్తికేయన్ తో మురుగదాస్ చేస్తున్న సినిమా పూర్తి కాగానే వెంటనే సల్మాన్ ఖాన్ తో సినిమా లైన్ లో ఉంది.

సికందర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో విపరీతమైన బజ్ ఏర్పడింది. సల్మాన్ ఖాన్ ఇదివరకు సినిమాల కన్నా సికందర్ మీద ఈ క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు మురుగదాస్ అని తెలుస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో మురుగదాస్ సినిమాలు చేశాడు. ఇప్పుడు సల్మాన్ తో కలిసి పనిచేయనున్నాడు.

మురుగదాస్ చేసిన ప్రతి బాలీవుడ్ సినిమా మంచి ఫలితాన్నే రాబట్టింది. అందుకే సల్మాన్ తో సినిమాకు ఈ రేంజ్ బజ్ వచ్చింది. అంతేకాదు సల్మాన్ ఖాన్ కి ఈమధ్య సరైన సినిమా పడట్లేదు. 2022 లో 3 సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ ఖాన్ వరుసగా 3 హిట్లతో అదరగొట్టేశాడు. ఇప్పుడు అర్జెంట్ గా సల్మాన్ ఖాన్ ఖాతాలో ఒక హిట్టు పడాలి. అందుకే ఆ హిట్ మురుగదాస్ సినిమాతోనే సాధ్యమవుతుందని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

సల్మాన్ ఖాన్ మురుగదాస్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సునీల్ శెట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పుడేదో పాన్ ఇండియా డైరెక్టర్ అని అంటున్నారు కానీ మురుగదాస్ ఎప్పుడో పాన్ ఇండియా డైరెక్టర్ గా తన సత్తా చాటాడు. మళ్లీ సికందర్ తో తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి సల్మాన్ ఖాన్ సికందర్ ఊహించిన దాని కన్నా రాబట్టిన ఈ బజ్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.