Begin typing your search above and press return to search.

ఆయన‌ మార్క్ ఎమోష‌న్ మిస్ అవ్వ‌లేదా?

కానీ ముగింపు మాత్రం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌డం ఆయ‌న‌కు మాత్రమే చెల్లింది. అదే క‌థ‌లో బ‌ల‌మైన ఎమోషన్ పండిచ‌గ‌ల ద‌ర్శ‌కుడిగా మంచి పేరుంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 2:30 PM GMT
ఆయన‌ మార్క్ ఎమోష‌న్ మిస్ అవ్వ‌లేదా?
X

ముర‌గ‌దాస్ సినిమాల్లో ఉండే యూనిక్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ క్రియేటివీటి హైలైట్ అవుతుంటుంది. ఆయ‌న సినిమా స్టోరీలు సాధార‌ణంగానే ఉంటాయి. సింపుల్ గానే క‌థ ప్రారంభ‌మ‌వుతుంది. కానీ ముగింపు మాత్రం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌డం ఆయ‌న‌కు మాత్రమే చెల్లింది. అదే క‌థ‌లో బ‌ల‌మైన ఎమోషన్ పండిచ‌గ‌ల ద‌ర్శ‌కుడిగా మంచి పేరుంది.

త‌న సినిమాల్లో సందేశం కూడా అంతే త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. సందేశం నుంచే ఆయ‌న క‌థ రాయ‌డం మొద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో సికంద‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని నిర్మాత సాజిద్ న‌డియావాలా ఎలాంటి స‌స్పెన్స్ లేకుండా ముందే రివీల్ చేసారు. మునుపెన్న‌డు చూడ‌ని యాక్ష‌న్ సికంద‌ర్ లో ఉంటుంద‌ని ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన రోజే చెప్పేసారు.

ఈ సినిమాలోనూ ముర‌గ‌దాస్ ఎమోష‌న్ ఏమాత్రం మిస్ అవ్వ‌న‌ట్లే తెలుస్తోంది. క‌థ‌లో కావాల్సినంత ఎమోష‌న్ ఉంద‌ని తాజాగా చిత్ర వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా మలు స్తూనే అంత‌కు మించి ఎమోష‌న్ ని కూడా అంతే బ‌లంగా చెప్ప‌బోతున్నారుట‌. కొన్ని స‌న్నివేశాలైతే కంట క‌న్నీరే పెట్టించేస్తాయ‌ని అంటున్నారు. వాటిలో స‌ల్మాన్ ఖాన్ న‌ట‌న నెక్స్ట్ లెవ‌ల్ ఉంటుంద‌ని చిత్ర బృందం ధీమా వ్య‌క్తం చేస్తుంది.

క్లైమాక్స్ లో దేశానికి త‌న మార్క్ బ‌ల‌మైన సందేశం కూడా పాస్ చేస్తున్నారుట‌. మొత్తానికి ముర‌గ‌దాస్ మ‌రోసారి అన్ని అంశాల్ని సికంద‌ర్ లో జోడించిన‌ట్లే క‌నిపిస్తుంది. ఇందులో స‌ల్మాన్ కిజోడీగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉన్నా! రొమాన్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేని నేప‌థ్యంలో హీరోయిన్ పాత్ర‌ని బ్యాలెన్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.