Begin typing your search above and press return to search.

సామ్ స్టైల్‌ గ‌ణ‌ప‌తి బ‌ప్పా సెల‌బ్రేష‌న్

ఇలాంటి స‌మ‌యంలో సమంతా రూత్ ప్రభు తన ఇంటికి గ‌ణేష్ బప్పాను స్వాగతించడానికి ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. స‌మంత ఒక యూనిక్ ఫోటోగ్రాఫ్ ని రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 10:01 AM GMT
సామ్ స్టైల్‌ గ‌ణ‌ప‌తి బ‌ప్పా సెల‌బ్రేష‌న్
X

వినాయ‌క చ‌వితి రోజున విఘ్న వినాయ‌కుని ప్ర‌త్యేక భక్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లాచ‌రించి అక్షింత‌లు వేసుకున్న త‌ర్వాతే చంద్రుని చూడాలనేది పురాణ క‌థ‌. ఈరోజు సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా అంద‌రూ గ‌ణేషుని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించారు. టాలీవుడ్ టు బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా గ‌ణేషుని ఉత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో సమంతా రూత్ ప్రభు తన ఇంటికి గ‌ణేష్ బప్పాను స్వాగతించడానికి ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. స‌మంత ఒక యూనిక్ ఫోటోగ్రాఫ్ ని రివీల్ చేసింది. సోషల్ మీడియాలో తన గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ హృద‌యాల‌ను ట‌చ్ చేసింది.

సమంత ఇన్‌స్టా ఫోటో ఆస‌క్తిని క‌లిగించింది. వినాయకుడి ఇత్తడి విగ్రహం.. పూజ కోసం ఉంచిన పుష్పాలు.. పండ్లు ఫ‌ల‌హారాలు వ‌గైరా ఈ ఫోటోగ్రాఫ్ లో ప్రత్యేక శోభ‌ను పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తెచ్చాయి. ప్రశాంతంగా దేవాధిదేవును స్వాగతించే వాతావరణం ఆక‌ర్షిస్తోంది. లేత గోధుమరంగు- నీలం రంగు కో-ఆర్డ్ సెట్‌ దుస్తులు ధరించిన‌ సమంతా బాల్క‌నీలో ఫోజులిచ్చిన పోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈరోజు ప్ర‌శాంత వ‌ద‌నంతో స‌మంత సిస‌లైన భ‌క్తురాలిగా క‌నిపించింది.

చాలామంది సెలబ్రిటీలు గణేష్ చతుర్థి వేడుకలను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. కానీ సమంత ఈ వేడుక‌ను చాలా సింపుల్ గా నిర్వ‌హించింద‌ని అర్థ‌మ‌వుతోంది. గ‌ణేషునిపై నిజమైన భక్తి క‌నిపించింది. సమంతా తన వృత్తిపరమైన కమిట్‌మెంట్‌లను వ్యక్తిగత ఆనందాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నవంబర్ 7న సిటాడెల్ స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. అలాగే సొంత బ్యాన‌ర్ లో బంగారం తెకెక‌క్కుతోంది.