Begin typing your search above and press return to search.

సామ్ తో బాలీవుడ్ యాక్టర్.. ఈ విషయం తెలుసా?

అదే ఇప్పుడు సామ్.. మరో యాక్షన్ థ్రిల్లర్ రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌ డమ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Feb 2025 9:30 AM GMT
సామ్ తో బాలీవుడ్ యాక్టర్.. ఈ విషయం తెలుసా?
X

స్టార్ హీరోయిన్ సమంత.. రీసెంట్ గా సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన ఆ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్ర పోషించారు. 80-90ల కాలంలో సమాజంలో మహిళల పరిస్థితి ఏంటనేది సిరీస్ లో చక్కగా చూపించారు మేకర్స్.

అయితే వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో వ్యూస్ అందుకున్న సిటడెల్ వెబ్ సిరీస్ లో సామ్ తన నటనతో అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అందరినీ మెప్పించిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దీంతో అనేక మంది ప్రశంసలు అందుకుంది. విమర్శకులు కూడా సమంత యాక్టింగ్ ను కొనియాడారు.

అదే ఇప్పుడు సామ్.. మరో యాక్షన్ థ్రిల్లర్ రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌ డమ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సిటడెల్ షూటింగ్ జరుగుతుండగానే.. సమంత రక్త్ బ్రహ్మండ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే టాక్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా వస్తున్న రక్త్ బ్రహ్మాండ్ కు తుంబాద్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు.

ఫ్యామిలీ మ్యాన్, సిటడెల్ సిరీస్ ల డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నారు. అయితే ఓ రాజవంశ కుటుంబం నేపథ్యంలో రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యం కోసం కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటాలతోపాటు రాజకీయ అంశాల్లో సాగనుందని.. సామ్ యువరాణి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది.

అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ రక్త్ బ్రహ్మండ్‌ లో సమంతతో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారని ఇప్పుడు తెలుస్తోంది. ఆదిత్య ఇటీవల యాక్షన్-ప్యాక్డ్ మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేశారని సమాచారం. తన రోల్ కోసం కత్తి యుద్ధంతోపాటు వివిధ మార్షల్ ఆర్ట్స్‌ లో శిక్షణ పొందారట.

ఇక రక్ష్ బ్రహ్మండ్‌ లో మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, వామిక గబ్బి కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన బడా స్టార్లు కూడా సిరీస్లో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా 2025లో సిరీస్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి రక్త్ బ్రహ్మండ్ సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.