Begin typing your search above and press return to search.

తీరిక స‌మ‌యంలో అడ‌విలో స‌మంత విహారం

రాజ‌స్థాన్ లోని ప్ర‌ఖ్యాత 'ర‌ణ‌తంబోర్ అట‌వీ ప్రాంతం' నుంచి కొన్ని అంద‌మైన ఫోటోల‌ను సామ్ షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   3 Nov 2024 7:14 AM GMT
తీరిక స‌మ‌యంలో అడ‌విలో స‌మంత విహారం
X

రాజ్ & డికె వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ నిరంత‌రం ట్రెండింగ్ లో ఉంటోంది స‌మంత‌. ప్ర‌స్తుతం ర‌క్త భ్ర‌హ్మాండ్ అనే వెబ్ సిరీస్ కోసం రాజ్ అండ్ డీకేతో క‌లిసి ప‌ని చేస్తోంది. అలాగే 'సిటాడెల్: హనీ బన్నీ' ఈ న‌వంబ‌ర్ 7న‌ స్ట్రీమింగుకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో వ‌రుణ్ ధావ‌న్, సమంత గూఢచారి పాత్రల‌లో న‌టించారు. ఇంతకుముందు రిలీజైన ట్రైల‌ర్ కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో సామ్ డేర్ డెవిల్ స్టంట్స్ తో మెరుపులు మెరిపించ‌నుంది. ధావ‌న్ బోయ్ తో స‌మంత జోడీ అంద‌రికీ న‌చ్చింది.

ఇదిలా ఉంటే స‌మంత ప్ర‌స్తుత షెడ్యూళ్ల నుంచి చిన్న‌పాటి రిలీఫ్ కోసం ఒక ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతానికి వెకేష‌న్ కి వెళ్లింది. అక్క‌డి నుంచి విడుద‌లైన ఫోటోగ్రాఫ్స్ లో సామ్ ఎంతో ప్లెజెంట్ గా క‌నిపిస్తోంది. సుదూర తీరంలో ద‌ట్ట‌మైన అడ‌విలో ప‌చ్చ‌ద‌నంలో పులులు తిరిగే చోట స‌మంత డేర్ డెవిల్ స్టంట్ ఉత్కంఠ రేపుతోంది.

రాజ‌స్థాన్ లోని ప్ర‌ఖ్యాత 'ర‌ణ‌తంబోర్ అట‌వీ ప్రాంతం' నుంచి కొన్ని అంద‌మైన ఫోటోల‌ను సామ్ షేర్ చేసింది. ఆనందకరమైన కొన్ని రోజులు ఇప్పుడు వెర్రి నవంబర్‌కి సిద్ధంగా.. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బ‌ర్వారా (రాజ‌స్థాన్) పాత -కొత్త అందాల‌ కలయిక... అద్భుతమైన అనుభవానికి ధన్యవాదాలు! అని రాసింది. ఇప్ప‌టికే స్పాట్ నుంచి తన అద్భుతమైన ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. అడవి జంతువులతో పాటు ప్రకృతి వైభవాన్ని అన్వేషించింది సామ్. అక్క‌డ స్థానికంగా పాట‌రీ వృత్తికారుల‌ గురించి, ఆహార ప‌దార్థాల సేక‌ర‌ణ గురించి ఈ ఫోటోలు ఆవిష్క‌రిస్తున్నాయి.

ఒక‌ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇస్తూ ''సగం పులితో పాటు ప్రకృతి వైభవాన్ని చూశాను. PS చివరి స్లయిడ్ టైగ‌ర్.. అద్భుతమైన ఫోటోగ్రాఫ్‌'' అని రాసింది. ఈ వారం ప్రారంభంలో సమంత జైపూర్‌కు ప్ర‌యాణ‌మైంది. అక్కడ ఫోటోగ్రాఫ‌ర్లు సామ్ ని వెంబ‌డించి కెమెరాల్లో బంధించారు. ఈ టూర్ లో స‌మంత విభిన్న‌మైన రంగు రంగుల దుస్తుల‌ను కూడా ధ‌రించి క‌నిపించింది. కొన్నిటిలో స్థానిక ట్రెడిష‌న్ కూడా క‌నిపించింది. కొన్ని ఫోటోల్లో లేడి పిల్ల‌ల సంచారం కూడా క‌నిపించింది. అక్క‌డ పాడుబ‌డిన వందేళ్ల నాటి కోట‌ క‌నిపించింది.