సమంత ఏం మాట్లాడినా.. చైతూ గురించేనా?
సమంత రూత్ ప్రభు ఇప్పుడు తన కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టింది. విడాకుల అనంతరం ఆమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.
By: Tupaki Desk | 12 Feb 2025 1:30 PM GMTసమంత రూత్ ప్రభు ఇప్పుడు తన కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టింది. విడాకుల అనంతరం ఆమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాల్లో కొత్త ఛాలెంజ్‌లు తీసుకోవడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవడం వంటి వాటితో ముందుకు సాగుతోంది. అయితే, ఆమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే అది గట్టిగానే ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన ఓ పోస్ట్ మళ్లీ చర్చనీయాంశమైంది.
"మనుషులు ఒక స్థితిలో ఉండిపోరు.. వారు మారిపోతూనే ఉంటారు" అనే సందేశాన్ని షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో దీన్ని నాగచైతన్య - శోభిత విషయానికి లింక్ చేసేస్తున్నారు. సామ్ నెగిటివ్ గా చేయకపోయినా అలాగే పాజిటివ్ గా స్పందించినా కూడా వారి గురించే అన్నట్లు హైలెట్ చేస్తున్నారు. అయితే అభిమానుల అభిప్రాయాలను బట్టి చూస్తే, ఇది పూర్తిగా తప్పు. సమంత తన జీవితాన్ని, తన కెరీర్‌ను గాడిలో పెట్టుకునే పనిలో ఉంది. ఆమె ప్రస్తుతం తన ఆలోచనలను, జీవితం గురించి తనకు వచ్చిన అనుభవాలను పంచుకుంటోంది.
ఆమె చెప్పే ప్రతి పదాన్ని చైతన్య సంబంధిత వ్యవహారాలతో ముడిపెట్టడం అన్యాయం. విడాకుల అనంతరం సమంత వ్యక్తిగత జీవితాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచమంతటా అనుభవాలను పెంచుకుంటూ, కొత్త అవకాశాలను ఒడిసిపట్టుకుంటూ తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతోంది.. అని అభిమానులు దీనికి తగిన విధంగా కౌంటర్ ఇస్తున్నారు.
సమంత నెవ్వర్ బిఫోర్ అనేలా ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు చేస్తోంది, ముంబై, లాస్ ఏంజెలెస్ లాంటి చోట్ల ప్రముఖులతో మీటింగ్స్ జరుపుతోంది. ఈ క్రమంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతున్నాయి. వాటిలో మంచి చెడులో కొన్ని భావాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సహజమే. ఈ విషయం అభిమానులకైతే బాగా అర్థమైంది. కానీ కొంతమంది మాత్రం ఏం జరిగినా సమంతను చైతన్య జీవితం వైపు లాగిపోవడం కేవలం ట్రోలింగ్ కోసమేనని ఫ్యాన్స్ అంటున్నారు.
విడాకుల తర్వాత కూడా సమంత ఎప్పుడూ చైతన్య గురించి నెగటివ్‌గా మాట్లాడలేదు. ఆమె చేసిన ప్రతి చిన్న కామెంట్‌ను చైతూ, శోభితల వ్యవహారానికి అన్వయించడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ఇక సమంత రేంజ్ పెరుగుతూనే ఉంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశాలు చూస్తోంది. ఓటీటీలో ఇప్పటికే సిటాడెల్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రీచ్ పొందుతోంది. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆమె సీరియస్‌గా ప్లానింగ్ చేస్తోంది. ఏదేమైనా ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే అది ఆమె వ్యక్తిగత ఆలోచనలతో సంబంధముంటుంది, లేదా ఉండకపోవచ్చు. కానీ మళ్లీ మళ్లీ ఆమెను గతంతో లింక్ చేయడం, చైతన్య విషయానికి తీసుకురావడం సరికాదని అభిమానులు అంటున్నారు. ఇకనైనా సమంతను ఆమె కెరీర్‌పై ఫోకస్ చేస్తున్న అద్భుతమైన నటిగా చూస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.