సమంత మరో బిజినెస్ స్టెప్.. ఆ బ్రాండ్ కో ఫౌండర్ గా..
రాజ్ అండ్ డీకే దర్శకత్వం చేసిన ఆ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
By: Tupaki Desk | 4 Oct 2024 3:00 AM GMTస్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం పేరుతో మూవీ అనౌన్స్ చేశారు. పోస్టర్ కూడా షేర్ చేయగా.. అందులో పవర్ ఫుల్ లుక్ లో సామ్ కనిపించారు. ఇప్పుడు త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో అలరించనున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం చేసిన ఆ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అయితే సినిమాలతో పాటు సమంత వ్యాపారాలపై కూడా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్యాషన్, స్కూల్స్, హోటల్స్ తో పాటు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. స్పోర్ట్స్ బిజినెస్ లోకి కూడా రీసెంట్ గా దిగారు. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేశారు. కొన్ని రోజుల క్రితం.. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్ నటేకర్ తో కలిసి ఫ్రాంచైజీని తీసుకున్నారు. ఆ సమయంలో సమంత.. స్పోర్ట్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ ను అంతా కొనియాడారు.
ఇప్పుడు సమంత మరో అడుగు ముందుకు వేశారు. వెల్ నెస్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కెమిస్ట్ కు సహ వ్యవస్థాపకురాలిగా మారారు. ఇన్ ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ కంపెనీ నేతృత్వంలోని సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్.. ఐదు లక్షల డాలర్స్ కోసం సీడ్ ఫండింగ్ ఇటీవల నిర్వహించింది. అందులో ఫార్మ్ ఈజీ వ్యవస్థాపకుడు సిద్ధార్థ షా, ప్లిక్స్ వ్యవస్థాపకుడు రిషుబ్ సతియా కూడా పాల్గొన్నారు. అంకితా తడాని, ఆకాష్ వాలియా ఇన్ ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ ను ముప్పై ఏళ్ల క్రితం స్థాపించారు.
అయితే సీక్రెట్ ఆల్కెమిస్ట్ విషయంలో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ను సమంత షేర్ చేసుకున్నారు. తాను అనారోగ్యం పాలైనప్పుడు.. విదేశాల కోసం చికిత్స వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆరోమోథెరపీ.. ఊహించని కంఫర్ట్ అందించిందని చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో హెల్త్ కోసం నూనెలు ఎందుకు ఉపయోగిస్తున్నారో తాను గ్రహించానని తెలిపారు. అప్పుడు తాను కూడా ట్రస్ట్ గల బ్రాండ్ కోసం వెతికానని చెప్పారు సమంత.
ఆ సమయంలో సీక్రెట్ ఆల్కెమిస్ట్ ను బెస్ట్ బ్రాండ్ గా కనుగొన్నట్లు సమంత తెలిపారు. అది తన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్పారు. అయితే సీక్రెట్ ఆల్కెమిస్ట్ కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించేందుకు రీసెంట్ గా నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ క్రీములు, మిస్ట్ లు, షవర్ జెల్ ల రూపంలో ఉత్తత్తులను పెంచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో.. సమంత తాను వాడిన బ్రాండ్ కే ఇప్పుడు కో ఫౌండర్ గా మారారు.