సమంత జీవితం ఇక ప్రతీది చివరి దశలో!
ప్రస్తుతం తన జీవితంలో ప్రతీ దానిని చివరిదిగా భావించే దశలో ఉన్నట్లు తెలిపింది. తాను ఏ పాత్ర చేసినా అది ప్రేక్షకులపై ప్రభావం చూపేలా ఉండాలంది.
By: Tupaki Desk | 24 Jan 2025 7:30 PM GMTనాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఆధ్యాత్మిక బాట పట్టడం...అటుపై ఒంటరిగా అమెరికాలో కొన్ని నెలలు గడపడం....హైదరాబాద్ ని వదిలి ముంబైకి షిప్ట్ అవ్వడం ఇవన్నీ సమంత అభిమానులకు కాస్త బాధకి, నిరు త్సాహానికి గురి చేసేవే. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కున్న ఎమోషన్ పెయిన్ అన్నది చిన్నది కాదు. ఎంతో మానసిక సంఘర్షణకు గురైంది. ఎన్నో విమర్శలు ఎదుర్కుంది. అన్నింటిని తట్టుకుని నిలబడి మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చింది.
ప్రస్తుతం ముంబైలో ఉంటూ బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా కమిట్ అయింది. హీరోయిన్ గా సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. చిన్నా చితకా ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. కానీ కమిట్ అవ్వడం లేదు. ఆసల్యమైనా పెద్ద ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా రాజ్ అండ్ డీకే తో ప్రత్యేకంగా పనిచేయడానికి గల కొన్ని కారణాలను రివీల్ చేసింది. సాధారణ సినిమాలు ఎన్నో అంగీకరించొచ్చు. కానీ అలా చేయనంటోంది.
ప్రస్తుతం తన జీవితంలో ప్రతీ దానిని చివరిదిగా భావించే దశలో ఉన్నట్లు తెలిపింది. తాను ఏ పాత్ర చేసినా అది ప్రేక్షకులపై ప్రభావం చూపేలా ఉండాలంది. వందశాంత నమ్మే పాత్రలు రావడం లేదని...అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. రాజ్ అండ్ డీకే సవాల్ గా అనిపించే స్క్రిప్టే లే తీసుకుంటారు. రోటీన్ కథలకు వాళ్లు దూరంగా ఉంటారు. వారితో కలిసి పని చేయడం నాకు కూడా సవాల్ గా అనిపిస్తుంది.
వారు రాసే పాత్రలు ఎంతో బలంగా ఉంటాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఉంటాయి. అందుకే వాళ్ల కథలకు సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. గొప్ప పాత్ర చేసాను అనే భావన రాకపోతే నటించాననే తృప్తి ఉండదు` అని అంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకేతో కలిసి `ఫ్యామిలీ మ్యాన్` ,` సీటాడెల్` సీరిస్ లకు సమంత పనిచేసిన సంగతి తెలిసిందే.