'గేమ్ ఛేంజర్' లా మారనున్న సమంత!
సోషల్ మీడియాలో మాత్రం ఏదో రూపంలో అభిమానుల అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చర్చించింది.
By: Tupaki Desk | 23 Jan 2025 12:37 PM GMTసమంత కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో తాను సాధించాల్సిన సక్సెస్ లు సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ లు చేసింది. హిందీ వెండిత తెరపైనా మెరవాలని ఆశ పడుతోంది. స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో అవకాశాలు అందుకో వడంలోనూ వెనుకబడుతుంది? అన్నది అంతే వాస్తవం. అమెరికా నుంచి తిరిగొచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా? ఇంతవరకూ ప్రతయ్నాల్లో ఉంది తప్ప ప్రాజెక్ట్ లాక్ చేయలేదు.
సోషల్ మీడియాలో మాత్రం ఏదో రూపంలో అభిమానుల అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చర్చించింది. రెండేళ్లగా అమ్మడు డైరీ రాయడం మొదలు పెట్టిందిట. డైరీ రాయడం మొదలైన నాటి నుంచి తనలో వస్తోన్న మార్పుల గురించి రివీల్ చేసింది. డైరీ రాయడం పాతపద్దతైనా భవిష్యత్ లో చదువుకోవడానికి...పాత జ్ఞాపకల్లోకి వెళ్లడానికి మంచి సాధనం. అప్పుడెలా ఉన్నా? ఇప్పుడెలా ఉన్నాం? అనే వ్యత్యాసం తెలుసుకోవడాని ఛాన్స్ ఉంటుంది.
విషయం చిన్నదైనా? డేలో ఏం జరుగుతుందో ప్రతీది డైరీ రాయడం ఎంతో మంచి అలవాటుగా పేర్కొంది. డైరీ రాయడం ఆరంభంలో ఇబ్బంది గా ఉన్నా ఒక్కసారి రాయడం మొదలైన తర్వాత అలవాటుగా మారితే రాయకుండా ఉండలేమంది. డే లో కొంత సమయాన్ని డైరీకి కేటాయిస్తే మనలో ఎంతో పరివర్తిన కలుగుతుంది. తప్పోప్పులు తెలుసు కోవడానికి అవకాశం ఉంటుంది. డైరీ ఇప్పుడో 'గేమ్ ఛేంజర్' లా మారింది.
అందుకే మీరు కూడా డైరీ రాయడం మొదలు పెట్టండి. ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ డైరీ కొన్నేళ్ల తర్వాత చెబుతుంది. ఇది ఎంతో మంచి అలవాటు. అందరూ అలవాటు చేసుకోండని అభిమానులకు సామ్ సూచించింది.