Begin typing your search above and press return to search.

ప్లీజ్‌ బరువు పెరగండి... సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌

సోషల్‌ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్‌ అంటూ సమంత ఫ్యాన్స్ తో చిట్‌ చాట్‌ చేసిన సమయంలో బరువు గురించిన ప్రశ్న వచ్చి ఆమెకు చిరాకు తెప్పించింది.

By:  Tupaki Desk   |   5 Nov 2024 6:05 AM GMT
ప్లీజ్‌ బరువు పెరగండి... సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌
X

స్టార్‌ హీరోయిన్‌ సమంత దాదాపు ఏడాది కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఎట్టకేలకు ఆమె షూటింగ్స్ కు హాజరు అవుతుంది. ఇంతకు ముందే షూటింగ్‌ పూర్తి అయిన 'సిటాడెల్‌ : హనీ బనీ' వెబ్‌ సిరీస్‌తో సమంత ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

రాజ్ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందిన సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా సమంత గత వారం పది రోజులుగా ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ వస్తుంది. మీడియా సమావేశాలు నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ సిటాడెల్‌ ను ప్రమోట్‌ చేస్తూ వస్తోంది. తాజాగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానం ఇచ్చి సిటాడెల్‌ విషయాలను పంచుకుంది. సోషల్‌ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్‌ అంటూ సమంత ఫ్యాన్స్ తో చిట్‌ చాట్‌ చేసిన సమయంలో బరువు గురించిన ప్రశ్న వచ్చి ఆమెకు చిరాకు తెప్పించింది.

సమంత అభిమాని ఒకరు.. గతంలో బరువు ఎక్కువ ఉన్నప్పుడే మీరు చాలా బాగున్నారు, ఇప్పుడు బరువు తగ్గడం వల్ల అందం తగ్గింది. కనుక దయచేసి మళ్లీ బరువు పెరగండి అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫ్యాన్‌ చేసింది విజ్ఞప్తి అయినా సమంతకు చిరాకు తెప్పించింది. ఈమధ్య కాలంలో ఆమెకు ఇలాంటి రిక్వెస్ట్ లు చాలా వస్తున్నాయి. అందుకే వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే ఉద్దేశ్యంతో బరువు గురించి మాట్లాడే వారు అందరికీ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది. మరెవ్వరు ఆ విషయమై మాట్లాడవద్దు అంటూ సున్నితంగా వార్నింగ్‌ ఇస్తూనే తన ఇబ్బందులను చెప్పుకొచ్చింది.

బరువు పెరిగే విషయమై సమంత స్పందిస్తూ... నా ఆరోగ్య పరిస్థితి, నా బరువు గురించి నాకు బాగా తెలుసు. నేను ప్రస్తుతం సీరియస్‌గా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ ను ఫాలో అవుతున్నాను. నా ఆరోగ్యం దృష్ట్యా ఆ డైట్ చాలా అవసరం. కనుకే నా బరువు ఇలా ఉంది. నా అనారోగ్య పరిస్థితుల కారణంగా కొన్ని విషయాల పట్ల నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక నా బరువు గురించి మళ్లీ మళ్లీ మాట్లాడవద్దు. ఇతరులను జడ్జ్ చేయడం మొదట ఆపి, మీ పని మీరు చేసుకుంటూ, ఇతరులను బతకనివ్వండి అంటూ సమంత అసహనం వ్యక్తం చేసింది.

సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఆ వ్యాధి కారణంగానే సమంత ఏడాది పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. విశ్రాంతి తీసుకున్న సమంత ఆరోగ్యం పూర్తిగా బాగు పడలేదని, ఆమెకు మరింత సమయం కావాల్సి ఉందని వైద్యులు అన్నారట. అయినా సినిమాలపై ఆసక్తితో, ప్రేక్షకుల కోసం, ఫ్యాన్స్ కోసం షూటింగ్స్ కి హాజరు అవుతుందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు.