సిటాడెల్ హనీ బన్నీ కోసం సమంతకు అవార్డ్
సమంత ఓవైపు మయోసైటిస్ కి చికిత్స పొందుతూనే, సిటాడెల్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. సిటాడెల్- హనీ బన్నీలో క్లిష్ఠమైన స్టంట్స్ తో అదరగొట్టేసింది.
By: Tupaki Desk | 21 March 2025 9:31 AM ISTసమంత ఓవైపు మయోసైటిస్ కి చికిత్స పొందుతూనే, సిటాడెల్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. సిటాడెల్- హనీ బన్నీలో క్లిష్ఠమైన స్టంట్స్ తో అదరగొట్టేసింది. అయితే ఈ శ్రమ వృధా పోలేదు. సామ్ నటన, యాక్షన్ సీన్స్ కి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మాతృకలో ప్రియాంక చోప్రా నటన కంటే, భారతీయ వెర్షన్ రీమేక్ లో సమంత నటనకు ఎక్కువ గుర్తింపు దక్కింది.
ఇప్పుడు `సిటాడెల్: హనీ బన్నీ`లో తన నటనకు సమంత రూత్ ప్రభు ఉత్తమ నటిగా ఓటీటీ అవార్డును గెలుచుకుంది. రాజ్& డికె దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ కూడా ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. న్యూస్18 షోషా రీల్ అవార్డ్స్ 2025 ఉత్సవాల్లో పాల్గొన్న సమంత ఆనందానికి అవధుల్లేవ్. అవార్డ్ అందుకున్న సమంత కళ్లలో మెరుపులు కనిపించాయి. తన హార్డ్ వర్క్ కి తగిన గుర్తింపు లభించిందనే ఆనందం తన కళ్లలో కనిపించింది.
హీరామండి లో నటించిన మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీరావ్ కూడా `ఉత్తమ నటి అవార్డ్` కోసం పోటీపడ్డారు. కానీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ సమంతను వరించింది. కిల్లర్ సూప్‌లో నటనకు గాను కొంకణా సేన్ శర్మ కూడా నామినేషన్లలో ఉన్నారు. ప్రైమ్ వీడియో సిరీస్ భారతీయ వెర్షన్ అయిన `సిటాడెల్: హనీ బన్నీ` సమంతను పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో ఆవిష్కరించింది. వెబ్ సిరీస్ లో సామ్ ప్రమాదకరమైన, రహస్య మిషన్‌లో ఏజెంట్‌గా నటించింది. ఆమె భర్తగా వరుణ్ ధావన్ నటించాడు.
ఈ ఏడాదంతా సమంత బిజీగా ఉంది. ప్రస్తుతం నిర్మాతగా `మా ఇంటి బంగారం` చిత్రీకరణపైనా సామ్ దృష్టి సారించింది. రాజ్ & డికే నిర్మిస్తున్న `రక్త్ బ్రహ్మండ్`లోను కీలక పాత్రలో నటిస్తోంది. సినిమా , డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటిలోనూ షోషా రీల్ అవార్డ్స్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే.