Begin typing your search above and press return to search.

సిటాడెల్: హనీ బన్నీ ట్రైలర్… సమంత హై వోల్టేజ్ యాక్షన్

‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్ తర్వాతగా సమంతకి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 10:01 AM GMT
సిటాడెల్: హనీ బన్నీ ట్రైలర్… సమంత హై వోల్టేజ్ యాక్షన్
X

సమంత, వరుణ్ ధావన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ప్రియాంకా చోప్రా నటించిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కి ఇది ఇండియన్ వెర్షన్. రూసో బ్రదర్స్ దీనికి కథ అందించారు. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్ తర్వాతగా సమంతకి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. అందులో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే నెవ్వర్ బిఫోర్ అని చెప్పొచ్చు.

అయితే ‘ది ఫ్యామిలీ మెన్ 2’లో ఆమె నెగిటివ్ రోల్ చేసింది. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ సారి ఆమెని యాక్షన్ హీరోయిన్ గా మార్చేసి ‘సిటాడెల్’ సిరీస్ తెరకెక్కించారు. ఇందులో సమంత సీక్రెట్ ఏజెంట్ గా నటించింది. అలాగే బిడ్డ తల్లిగా కూడా కనిపించబోతోందని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. అనవసరమైన ఎలివేషన్స్ లేకుండా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ ట్రైలర్ ని రాజ్ అండ్ డీకే డిజైన్ చేశారు.

ఓ వైపు వరుణ్ ధావన్, మరో వైపు సమంత వారు ఐడెంటిటీ వెతుక్కునే పనిలో ఉన్నారు. అలాగే వారి మీద ఎటాక్ చేసేవారి నుంచి తప్పించుకోవడానికి ఫైట్ చేస్తారు. గతంలో ఇద్దరు కలిసి పనిచేసినట్లు తెలుసుకుంటారు. వారి జర్నీలో ఎదురయ్యే సవాళ్లని ఎలా బ్రేక్ చేసి ముందుకెళ్లారనే ఎలిమెంట్ తో ‘సిటాడెల్: హనీ బన్నీ’ కథాంశం ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ట్రైలర్ చూస్తుంటే సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.

ప్రతి ఫైట్ లో ఆమె ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో యాక్షన్ క్వీన్ గా సమంత ఈ సిరీస్ తో మారబోతోందని అనిపిస్తోంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ఆమె పోషించింది. ఈ సిరీస్ హిట్ అయితే మాత్రం సమంత బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతుందని చెప్పొచ్చు. రాజ్ అండ్ డీకే మరో యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారని ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. డిసెంబర్ 7న ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సిరీస్ సమంత, వరుణ్ ధావన్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే సమంత ఈ సిరీస్ కాకుండా హిందీలో మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.