Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో లింగ సమానత్వంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

'సిటాడెల్: హనీ బన్నీ' ప్రెస్ మీట్ లో 'భవిష్యత్తులో సినీ పరిశ్రమలో మహిళల ప్రాధాన్యం ఎలా ఉండబోతోంది?' అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ''ఇండస్ట్రీలో ఆడవారి ఫ్యూచర్ బాగుంది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 4:48 PM GMT
ఇండస్ట్రీలో లింగ సమానత్వంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ "సిటాడెల్: హనీ బన్నీ". ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సామ్ పాల్గొంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో మహిళా ప్రాతినిధ్యం గురించి, లింగ సమానత్వం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'సిటాడెల్: హనీ బన్నీ' ప్రెస్ మీట్ లో 'భవిష్యత్తులో సినీ పరిశ్రమలో మహిళల ప్రాధాన్యం ఎలా ఉండబోతోంది?' అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ''ఇండస్ట్రీలో ఆడవారి ఫ్యూచర్ బాగుంది. ఇప్పుడు సమానంగా ఉందని నాకు తెలుసు, కానీ అది లింగ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్లేయింగ్ గ్రౌండ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలివి, ప్రతిభ, బలాలు.. లింగ భేదం లేకుండా మీ ఫేట్ ని నిర్ణయిస్తాయి. అదే అద్భుతమైన ప్రదేశం అవుతుంది” అని సమంత చెప్పింది.

“ఈ ప్లాట్‌ఫారమ్ చాలా విస్తృతమైన అవకాశాలు కల్పిస్తుంది. మహిళల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. ఈ ప్రపంచంలో భాగమైనందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వ్యక్తులతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అని సమంత తెలిపింది. ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ సమానంగా అవకాశాలు రావాలని తాను కోరుకుంటున్నాని చెప్పిన సామ్.. ఇప్పటికే ఇండస్ట్రీలో ఆ మార్పు వచ్చినట్లు చెప్పింది.

ఇక 'సిటాడెల్' గురించి మాట్లాడుతూ.. సాధారణంగా స్పై జానర్‌ లో రూపొందే వెబ్‌ సిరీస్‌ లేదా సినిమాలలో ఎప్పుడూ పురుష పాత్రలకే ప్రాధాన్యత ఉంటుంది. వారే యాక్షన్ చేస్తారు.. డైలాగ్స్ చెబుతారు. కానీ దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కొంత మేరకు యాక్షన్ సీన్స్ చేశాను. అవి అందరికీ నచ్చుతాయనే అనుకుంటున్నాను అని సమంత రూత్ ప్రభు చెప్పుకొచ్చింది.

రాజ్‌ & డీకే దర్శకత్వంలో "సిటాడెల్: హనీ బన్నీ" సిరీస్ రూపొందింది. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ ప్రధాన పాత్రలో రూసో బ్రదర్స్ తీసిన సిటాడెల్ సిరీస్ కు ఇండియన్‌ వెర్షన్‌ ఇది. గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో.. వరుణ్ ధావన్, సమంత ఇద్దరూ స్పై ఏజెంట్ లుగా కనిపించనున్నారు. ఇందులో యాక్షన్‌ సీన్స్ కోసం సామ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో నవంబర్ 7వ తేదీ నుంచి అన్ని భారతీయ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

రాజ్‌ - డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ వెబ్ సిరీస్‌ తో సమంత ఓటీటీలో అడుగుపెట్టింది. ఇందులో రాజీ అనే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న బోల్డ్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి యాక్షన్-ప్యాక్డ్ సిరీస్ లో అలరించడానికి వస్తోంది. మరి ఈ స్పై సిరీస్ సామ్ కు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే, చివరగా 'ఖుషి' లో కనిపించింది. తన హోమ్ బ్యానర్ లో 'మా ఇంటి బంగారం' అనే పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించింది.