నాన్న వల్లే యాక్సెప్ట్ చేయలేకపోయా: సామ్
చిన్నప్పుడు తన తండ్రి ఆడిన కొన్ని మాటల వల్ల అభద్రతాభావంతో ఎలా పోరాడారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
By: Tupaki Desk | 27 Nov 2024 11:30 AM GMTస్టార్ హీరోయిన్ సమంత.. ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లింగ్ జోనర్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వెబ్ సిరీస్ లో తన అదిరిపోయే నటనతో సామ్.. విమర్శకుల నుంచి కూడా అందుకుంటున్నారు.
అయితే సిటాడెల్ తర్వాత సమంత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అనేక విషయాలను పంచుకుంటున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. మయోసైటిస్ తో ఎలా బాధపడ్డారో షేర్ చేసుకుంటున్నారు. చిన్నప్పుడు తన తండ్రి ఆడిన కొన్ని మాటల వల్ల అభద్రతాభావంతో ఎలా పోరాడారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తన జీవితంలో ఎదుగుతున్నా ఒక సర్టిఫికేషన్ కోసం పోరాడాల్సి వచ్చిందని సామ్ చెప్పారు. తన తండ్రి ఆలోచనా విధానం వేరని అన్నారు. చాలా మంది ఇండియన్స్ పేరెంట్స్ కూడా అలానే ఉంటారని వ్యాఖ్యానించారు. తమను రక్షిస్తున్నట్లు వారు భావిస్తారని.. నిజానికి పిల్లలను కాస్త తెలివి తక్కువ వారిగా ఎప్పుడూ భావిస్తుంటారని సమంత వ్యాఖ్యానించారు.
తనకు చిన్నప్పుడు స్కూల్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా.. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్లే సాధించావని అనేవారిని సమంత తెలిపారు. అలా అలాంటి మాటల ప్రభావం తనపై ఎక్కువగా పడిందని చెప్పారు. ఏ మాయ చేశావే మూవీ సూపర్ హిట్ అయినప్పుడు వచ్చిన ప్రశంసలను అంగీకరించడం చాలా కష్టమైందని తెలిపారు.
అంతా తనపై ప్రశంసలు కురిపిస్తున్నారని, కానీ వాటిని ఎలా యాక్సెప్ట్ చేయోలో తెలియదని చెప్పారు సామ్. తనకు చిన్నప్పటి నుంచి ప్రతిదీ తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేదని చెప్పారు. తనకు ఉన్న అభద్రతాభావాలను అధిగమించడం కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు. 10-12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టిందని అన్నారు.
ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సామ్ అప్ కమింగ్ చిత్రాల విషయానికొస్తే.. మా ఇంటి బంగారం మూవీని తన బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ చేశారు. తన సొంత ప్రొడక్షన్ సంస్థ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.