Begin typing your search above and press return to search.

'చరణ్ ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు'.. సమంత ప్రశంసల వర్షం

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుతున్న మేకర్స్.. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 2:00 PM GMT
చరణ్ ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. సమంత ప్రశంసల వర్షం
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడేళ్ల క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుతున్న మేకర్స్.. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


అయితే గేమ్ ఛేంజర్ ఎప్పుడో మొదలైనప్పటికీ... మేకర్స్ సరైన అప్డేట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు మేకర్స్. సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్ పేరుతో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా సెకెండ్ సింగిల్ రా మచ్చా మచ్చాను విడుదల చేశారు. లిరికల్ వీడియో సాంగ్ లో చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులతో అదరగొట్టారు. ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి అలరించారు.


ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చారు. నకాష్ అజీజ్‌ ఆలపించారు. ప్రస్తుతం రా మచ్చా మచ్చా సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. 16 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. అయితే సాంగ్ రిలీజ్ అయ్యాక.. తాను పాటను ఆనందించినట్లు, మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నానని పోస్ట్ చేశారు రామ్ చరణ్. ఆ తర్వాత మిస్టర్ సీ.. హై ఓల్టేజ్ పుట్టించారని చరణ్ సతీమణి ఉపాసన కామెంట్ చేశారు.

తాజాగా స్టార్ హీరోయిన్ సమంత.. రా మచ్చా మచ్చా సాంగ్ లో రామ్ చరణ్ డ్యాన్స్ పై రెస్పాండ్ అయ్యారు. అన్ మ్యాచ్ బుల్.. ఫార్మల్ ప్యాంట్, షర్ట్ ధరించి ఎవరూ ఇలా డ్యాన్స్ చేయగలరా అంటూ ప్రశంసించారు. అయితే గతంలో రామ్‌ చరణ్‌, సమంత రంగస్థలం మూవీ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికొస్తే.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, జయరామ్‌, నవీన్‌ చంద్ర, ప్రకాష్ రాజ్‌ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.