అన్నింటికంటే కష్టమైనది ఒంటరితనమే: సమంత
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.
By: Tupaki Desk | 20 Feb 2025 7:30 PM GMTగత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. రీసెంట్ గా సమంత అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలు చేసినా చేయకపోయినా సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.
తన టూర్స్ గురించి, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసే సమంత తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ రోజుల్లో ఎవరూ ఫోన్ ను విడిచి క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అలాంటిది సమంత ఎవరితో సంబంధం లేకుండా, కనీసం తన ఫోన్ కూడా తన దగ్గర లేకుండా మూడు రోజులు గడిపిందట.
మూడు రోజుల పాటూ తాను సైలెంట్ గా ఉన్నానని, ఫోన్ లేదని, ఎవరితో కమ్యూనికేషన్ కూడా లేదని, తనతో తాను మాత్రమే ఉన్నానని, మనతో మనం ఒంటరిగా ఉండటం అన్నింటి కంటే కష్టమైందని, చాలా భయంకరమైనదని, కానీ అలా ఉండటాన్ని తానెంతో ఇష్టపడతానని, మీరు కూడా అలా ఉండటానికి ట్రై చేయమని తన ఫ్యాన్స్ కు చెప్తోంది సమంత.
ఇక సమంత కెరీర్ విషయానికొస్తే అమ్మడు ఈ మధ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తుంది. సిటాడెల్ తో తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డ్ గెలుచుకున్న సమంత, ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. తుంబాడ్ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. రీసెంట్ గానే సమంత ఈ షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలిపింది.
అయితే తెలుగులో మాత్రం సమంత నుంచి సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. ఆమె నుంచి వచ్చిన ఆఖరి తెలుగు సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి సమంత తెలుగులో మరో సినిమాను చేసింది లేదు. సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను గతేడాది అనౌన్స్ చేసింది కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.