ఉదయం నుంచి రాత్రి వరకు సమంత రొటీన్ లైఫ్ ఇలా..!
తాజాగా తన రోజు వారి లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాలను తెలియజేస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
By: Tupaki Desk | 11 Sep 2024 12:36 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయింది. సినిమాలు, సిరీస్‌లు, యాడ్స్ ఇలా ఏదో ఒక షూట్ తో రోజూ బిజీ బిజీగా గడుపుతోంది. ఎంత బిజీగా ఉన్నా తన రొటీన్ వర్కౌట్స్, హెల్త్ కేరింగ్ మాత్రం మరవదు. తాజాగా తన రోజు వారి లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాలను తెలియజేస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ వీడియో లో సమంత ఉదయం ఆరు గంటల నుంచి మొదలుకుని రాత్రి 10 గంటలకు పడుకునే వరకు అన్ని విషయాలను అభిమానులు ఇంకా తన ఫాలోవర్స్ తో ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది.
ఉదయం లేవగానే 6.30 గంటల సమయంలో సూర్య రష్మీ కోసం కొంత సమయం ఎండలో నిల్చుంటుంది. ఆ తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. ఆ వెంటనే హెయిర్ మసాజ్ చేయించుకుంటుంది. ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడి పూజలో పాల్గొంటుంది. పూజ తర్వాత షూటింగ్ కి సమంత వెళ్తుంది. ఆ సమయంలో కంటికి ప్రొటక్షన్ గా ఒక పరికరంను అమర్చుకుంటుంది. ఉదయం 9 గంటల వరకు షూటింగ్ కోసం సెట్స్ లో ఉంటుంది. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఆరు గంటలకు లైట్ థెరపీ కోసం వెళ్తుందట.
సాయంత్రం సమయంలో వ్యాయామంగా పికెట్ బాల్ ఆడుతుందట. రాత్రి 9.30 సమయంలో మెడిటేషన్ చేస్తుంది. అర గంటల సమయం తర్వాత 10 గంటలకు బెడ్ ఎక్కేస్తుంది. సాధారణంగా సెలబ్రెటీలు మధ్య రాత్రి వరకు తిరిగి ఆ తర్వాత పడుకుని తెల్లవారుజామున లేవకుండా చాలా పొద్దు పోయే వరకు పడుకునే ఉంటారు. కానీ సమంత మాత్రం ఉదయం ఆరు గంటలకు లేవడం, రాత్రి పది గంటలకు పడుకోవడం చేస్తుందంటే ఆమె క్రమశిక్షణ అభినందనీయం అంటూ నెట్టింట ఆమె షేర్ చేసిన వీడియో కు తెగ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక సమంత సినిమాలు సిరీస్ ల విషయానికి వస్తే.. ప్రస్తుతం బంగారం అనే పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ చేస్తోంది. అదే సమయంలో రెండు వెబ్ సిరీస్ లు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే హిందీలో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కోలీవుడ్ లో కూడా ఈమె సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ కి జోడీగా ఒక సినిమాలో సమంత నటించబోతుందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. సమంత ఎక్కువగా హిందీ సినిమాలు, సిరీస్ లపై దృష్టి పెట్టిందని, ముందు ముందు ఆమె నుంచి ఎక్కువ హిందీ భాష సినిమాలు, సిరీస్ లు మాత్రమే వస్తాయనే టాక్ వినిపిస్తోంది.