Begin typing your search above and press return to search.

సమంత లుక్ లో బిగ్ ఛేంజ్.. ఈ ఫొటో చూశారా..

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా క్రేజ్ దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 10:30 AM GMT
సమంత లుక్ లో బిగ్ ఛేంజ్.. ఈ ఫొటో చూశారా..
X

హీరోయిన్ సమంత రేంజే వేరు.. సినిమాలు ఉన్నా లేకపోయినా ఆమె ఫ్యాన్ బేస్ లో ఎలాంటి ఛేంజ్ ఉండదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈవెంట్స్ లో అప్పుడప్పుడు పాల్గొని పాకెట్ మనీ సంపాదించుకున్న స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది సామ్. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.


ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఆమె చేసిన.. సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఆ సిరీస్ కోసం పలు విద్యలు నేర్చుకున్న సామ్.. షూటింగ్ టైమ్ లో పలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా షేర్ చేసుకుంది.

అయితే మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ సమంత.. చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మాలీవుడ్ లోకి మమ్ముట్టి సినిమాతో ఎంట్రీ ఇవ్వనుందని, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కాగా, ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే సామ్.. ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. తన కొత్త లుక్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఏ డే ఇన్ మై లైఫ్ అంటూ వీడియో పోస్ట్ చేసిన సమంత.. ఇప్పుడు క్రేజీ పిక్ ను షేర్ చేసింది. అందులో సమంత హెయిర్ ఫెయిర్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రెడ్ కలర్ హెయిర్ తో ఉన్న సమంత ఫోటో.. ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

మొత్తానికి.. సమంత కొత్త అవతార్ లో చాలా గ్లోయింగ్ కనిపిస్తుంది. తన గ్లామరస్ ఫేస్ కు హెయిర్ ఫెయిర్ ఛేంజ్ బిగ్ అసెట్ గా మారింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు.. సమంతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విభిన్నమైన లుక్స్ ట్రై చేయడంలో సమంత తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి స్టైల్ లో అయినా ఆమె అదిరిపోతుందని చెబుతున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతూ.. లైక్స్ కొడుతూ.. షేర్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు.