Begin typing your search above and press return to search.

సమంత కుటుంబంలో విషాదం.. తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

“మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హృదయాన్ని కదిలించే క్యాప్షన్ తో ఓ ఫోటోను పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   29 Nov 2024 11:47 AM GMT
సమంత కుటుంబంలో విషాదం.. తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషాద వార్తను సమంత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హృదయాన్ని కదిలించే క్యాప్షన్ తో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

సమంత 1987లో చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించారు. జోసెఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో ఇండియన్ కుటుంబానికి చెందినవారు. సమంత తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించారు. తండ్రి తన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారని, ప్రతి అడుగులోనూ తనకు ప్రేరణగా నిలిచారని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

సమంత తన కెరీర్ ఆరంభం నుంచి కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని చూసేవారు. సమంతకు తన తండ్రి మద్దతు ఎంత ముఖ్యమో ఆమె పలు సందర్భాల్లో చెప్పిన మాటల ద్వారా స్పష్టమైంది. జోసెఫ్ ప్రభు మరణవార్త తెలిసి, సినీ పరిశ్రమ నుంచి అనేక మంది ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

అలాగే, సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఎమోషనల్ గా స్పందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం సమంత తన సినిమాల బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ, ఈ సంఘటన ఆమెను ఎంతగానో బాధించింది. ఈ సమయంలో ఆమె కుటుంబానికి మద్దతుగా నిలబడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సమంత, ఆమె కుటుంబానికి మనస్ఫూర్తిగా సానుభూతి తెలుపుతూ, ఆ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

సమంత ఇటీవల బాలీవుడ్ లో సీటాడెల్: హాని బన్నీ లో నటించిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రమోషన్ లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంది. ఇక హఠాత్తుగా ఈ తరహా ఘటన జరగడంతో ఆమె ఒక్కసారిగా మనోవేదనకు గురయ్యారు. ఇక చివరగా తెలుగులో యశోద - శకుంతలం - ఖుషి సినిమాలలో నటించింది. ఆ సినిమాలు ఆమెకు నటిగా మంచి గుర్తింపుని అందించాయి.