Begin typing your search above and press return to search.

కష్ట సమయంలో అతను అండగా నిలిచాడు: సమంత

ఇక ఆమెకు సన్నిహితులుగా ఉండే అతికొద్ది మంది చాలా సపోర్ట్ గా ఉన్నారట.

By:  Tupaki Desk   |   24 Jan 2025 9:30 PM GMT
కష్ట సమయంలో అతను అండగా నిలిచాడు: సమంత
X

తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సమంతా వ్యక్తిగతంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ, తన పోరాటంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే ఆమె మయోసిటిస్ అనే ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చింది. ఇక ఆమెకు సన్నిహితులుగా ఉండే అతికొద్ది మంది చాలా సపోర్ట్ గా ఉన్నారట.

అయితే ఇటీవల ఆమె జీవితంలో ఒక ముఖ్య వ్యక్తి, రాహుల్ తన పాత్రను ఎంత గొప్పగా నిర్వర్తించాడో చెప్పుకొచ్చారు. 17 ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, రాహుల్ తనకు ఎంత ప్రత్యేకమైనవాడో సమంతా స్పష్టంగా చెప్పారు. మయోసిటిస్ చికిత్స సమయంలో అతను ప్రతీరోజూ ఆమెను పరామర్శించేందుకు వచ్చేవారట. కొద్దీ సమయాన్ని సరదాగా గడిపించేందుకు ఆటలు ఆడిస్తూ, సమంతను ఆలోచనల నుండి తప్పించి ఉల్లాసంగా ఉండేలా చూసేవారని తెలిపారు.

"ఆ సమయంలో నా ఇంటికి ప్రతీరోజూ వచ్చి నన్ను ఆటలతో, చిట్‌చాట్‌తో అలరిస్తూ, నాకు మళ్లీ పని చేసే ఉత్సాహాన్ని కలిగించాడు" అని సమంతా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. రాహుల్ వంటి స్నేహితులు జీవితంలో దొరకడం నిజంగా అదృష్టమని ఆమె అభిప్రాయపడింది. సమంతా కెరీర్ ప్రారంభంలోనే సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో మంచి బాండింగ్ ఏర్పడింది.

సమంత నటించిన చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పింది చిన్మయి. ఇక ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతుండటంతో, చిన్మయి ఆమెకు మరొక కీలక మద్దతుగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సమంతా వ్యక్తిగత జీవితంలో, రాహుల్, చిన్మయి వంటి వ్యక్తులు ఆమెను గట్టిగా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు. మయోసిటిస్ వంటి వ్యాధి కారణంగా శారీరకంగా దెబ్బతిన్న సమంతా, మానసికంగా కూడా కుంగిపోతున్న సమయంలో రాహుల్ ఆమెను ప్రోత్సహించడం, మళ్లీ జీవితం పట్ల ధైర్యాన్ని కలిగించడం ఎంతో ప్రత్యేకం.

"ఆ సమయం నా జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్. రాహుల్ నా తోడుగా నిలబడి నన్ను మళ్లీ నా పనిలో మునిగిపోయేలా చేశారు" అని చెప్పిన సమంతా, స్నేహం విలువను మరోసారి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమంతా కెరీర్‌లో బిజీగా ఉంటూ, వ్యక్తిగత జీవితాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత హిందీలో రక్త బ్రహ్మాండ్ అనే ఒక సినిమాతో బిజీగా ఉన్నారు.