ప్రతీ అడుగులోనూ పాఠం...అందులో ఓ పోరాటం!
సమంత టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అగ్ర నాయికగా ఓ వెలుగు వెలిగిన అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టి పనిచేస్తోంది.
By: Tupaki Desk | 8 March 2025 7:00 PM ISTసమంత టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అగ్ర నాయికగా ఓ వెలుగు వెలిగిన అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. నటిగా హిందీ చిత్ర సీమలోనూ సత్తా చాటాలని ఎదురు చూస్తోంది. తాజాగా సమంత చిత్ర పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు పూర్తయింది. ఈ 15 ఏళ్ల ప్రయాణాన్ని ఓ పాఠంగా...పోరాటంగా భావిస్తోంది. ఇప్పటి వరకూ వేసిన ప్రతీ అడుగులోనూ ఓ పాఠం నేర్చుకుందిట.
ఆ పాఠం నుంచి ఓపోరాటాన్ని అలవాటు చేసుకున్నట్లు తెలిపింది. సుదీర్గ ప్రయాణంలో ఎదురైన విజయాలు.. పరాజయాలు రెండు పోరాట తత్వాన్నే నేర్పించాయంది. ఒకసారి గొప్ప విజయం దక్కింతే చాలు. చాలా మంది ఓ సంతృప్తితో విశ్రమిస్తుంటారు. కానీ సమంత మాత్రం ఆ విజయాన్ని ఓసవాల్ గా తీసుకుని ముందుకు సాగుతుందిట. ఆ విజయాన్ని మించి మరో గొప్ప సక్సెస్ అందుకోవాలి అన్న లక్ష్యంతో పని చేస్తుందిట.
అదే పరాజయం ఎదురైతే దాన్ని ఓ మచ్చగా భావించి మరింత కసితో పనిచేస్తానంది. సమంత మాటల్ని బట్టి తానెంత కసి పట్టుదలతో ఉంటుంది? అన్నది అద్దం పడుతుంది. ఇండస్ట్రీలో 15 ఏళ్ల ప్రయాణం అంటే చిన్న విషయం కాదు. అగ్ర నాయికగా స్టార్ డమ్ కాపాండుకుంటూ రావడం అంటే రోజూ సవాలే. అప్పటికే స్థిరపడిన భామల నుంచి పోటీ ఎదుర్కోవాలి. మరోవైపు నవతరం భామలు దూసుకొస్తుంటారు.
వాళ్లను దాటుకుని అవకాశాలు అందుకోవాలి. ఆ విషయంలో సమంత గొప్ప సక్సెస్ సాధించిందని చెప్పాలి. ఇక వ్యక్తిగత జీవితంలో అమ్మడు ఎదుర్కొన్న ఆటు పోట్లు చిన్నవి కాదు. నాగచైతన్యతో విడాకుల సమయంలో ఎంతటి మనో వేదనకు గురైందన్నది తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కుంది. అలాగే అరోగ్య పరంగానూ సవాళ్లు ఎదుర్కుంది. అనారోగ్యం బారిన పడి తిరిగి కోలుకుని మళ్లీ నిలబడింది. ఇదంతా సమంతలో పట్టుదలతోనే సాధ్యమైంది.