Begin typing your search above and press return to search.

చార‌ల గుర్రంలా చలాకీగా సామ్

స‌మంత ఎంద‌రిలో ఉన్నా అంద‌రిలోను స‌మంతే హైలైట్. భార‌త‌దేశంలో అంత గొప్ప ఫ్యాష‌నిస్టాగా త‌న‌కంటూ ఒక గుర్తింపు రేంజు ఉంది.

By:  Tupaki Desk   |   27 March 2025 3:16 AM
చార‌ల గుర్రంలా చలాకీగా సామ్
X

స‌మంత ఎంద‌రిలో ఉన్నా అంద‌రిలోను స‌మంతే హైలైట్. భార‌త‌దేశంలో అంత గొప్ప ఫ్యాష‌నిస్టాగా త‌న‌కంటూ ఒక గుర్తింపు రేంజు ఉంది. తాజాగా స‌మంత కొత్త లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. బ్లాక్ అండ్ వైట్ డిజైన‌ర్ లుక్‌లో రాణిలా మెరిసిపోతోంది. క్యూట్ గా ఎంతో అందంగా క‌నిపిస్తోంది.


చేతిలో చిక్ హ్యాండ్‌బ్యాగ్‌తో చెట్టు కింద పోజులిచ్చిన సామ్ వ‌ర‌ల్డ్ బెస్ట్ ఫ్యాషన్ ఐకాన్‌గా కనిపించింది. స‌మంత అందానికి, ఫ్యాష‌న్ సెన్స్ కి అభిమానులు ముగ్దులైపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. అయితే స‌మంత ఇంత‌కీ ఏ దేశానికి వెళ్లిపోయింది? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

సామ్ ఒంట‌రిగానే విదేశాల‌కు వెళ్లిందా? అంటూ కూడా కొన్ని సందేహాలు నెటిజ‌నుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌లే ఆస్ప‌త్రి బెడ్ పై క‌నిపించిన సామ్ ఇంత‌లోనే ఇప్పుడిలా ఇంత స్టైలిష్ గా ఎలా మారింది? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. కొంద‌రు ఈ డ్రెస్ లో చారల గుర్రంలా చలాకీగా క‌నిపిస్తోంద‌ని కూడా కామెంట్ చేస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నందిని రెడ్డి దర్శకత్వంలో `మా ఇంటి బంగారం`లో స‌మంత‌ న‌టిస్తోంది. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో నే `ఓ బేబి` వ‌చ్చి ఘ‌న‌విజయం సాధించింది. ఇప్పుడు మ‌రోసారి ఈ జోడీ క‌లిసి ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.