Begin typing your search above and press return to search.

సమంత ఆరోగ్య ప్రయాణం.. ఫ్యాన్స్‌కు మరో బిగ్ అప్‌డేట్!

తన సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒక సరైన ట్రాక్ లో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

By:  Tupaki Desk   |   6 March 2025 2:00 AM IST
సమంత ఆరోగ్య ప్రయాణం.. ఫ్యాన్స్‌కు మరో బిగ్ అప్‌డేట్!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు గత కొంతకాలంగా సినిమాలకంటే కూడా తన పర్సనల్ లైఫ్ లో తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తన సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒక సరైన ట్రాక్ లో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సినిమాల్లో గ్లామర్, యాక్షన్, ఎమోషన్‌తో అలరించడమే కాకుండా, తన ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఫిట్‌నెస్, ఆరోగ్యంపై అభిమానులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇటీవల ఆమె ప్రారంభించిన హెల్త్ యూట్యూబ్ కార్యక్రమం 'టేక్ 20'కి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా, రెండో ఎపిసోడ్‌లో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ థామస్ లేవీతో ఆమె చర్చించిన ఆరోగ్య రహస్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎపిసోడ్‌లో సమంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విషతత్వాల గురించి చర్చించారు. డాక్టర్ లేవీ తన ‘Toxins, The Cause of All Diseases’ అనే పుస్తకంలోని ముఖ్యమైన విషయాలను వివరిస్తూ, మన రోజువారీ జీవనశైలిలో ఉండే విషతత్వాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరించారు.

ఆయన చెప్పిన మేరకు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది అనేక వ్యాధులకు మూల కారణం అవుతోంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి క్యాన్సర్ వరకు అనేక ఆరోగ్య సమస్యలకు ఈ విషతత్వాలు ప్రధాన కారణమని వెల్లడించారు. సమంత ఈ కార్యక్రమం ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. కొంత కాలంగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న ఆమె, సహజ చికిత్సా విధానాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

వైద్యుల సూచనల మేరకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, రోజువారీ విషతత్వాలను తొలగించుకునే పద్ధతులు పాటించడం వంటి విషయాల గురించి వివరించారు. ముఖ్యంగా, డాక్టర్ లేవీ చెప్పినట్టు విటమిన్ C ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తుందని, తన అనుభవంలో కూడా ఇది చాలా ఉపయోగపడిందని పేర్కొన్నారు.

సమంతా సినిమాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో, ఆరోగ్య పరంగా కూడా అంతే శ్రద్ధ చూపిస్తున్నారు. ఆరోగ్యంపై ఆమె పెంచుకున్న అవగాహన ఇప్పుడు మరింత ప్రాముఖ్యత పొందుతోంది. ఇలాంటి ప్రముఖుల ఆరోగ్య కార్యక్రమాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌ను చూస్తే, రోజువారీ ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలో, విషతత్వాలను ఎలా తగ్గించుకోవాలో, ఆరోగ్యంగా ఎలా ఉండాలో స్పష్టమైన అవగాహన పొందవచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం, సమంత భారీ స్థాయిలో రూపొందుతున్న యాక్షన్nఫాంటసీ వెబ్ రక్త బ్రహ్మాండ: ది బ్లడి కింగ్‌డమ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రాజ్ డీకే నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కు అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సమంత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో పాటు, మరిన్ని సినిమాలు కూడా ఆమె లైన్‌లో ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.