ఆస్పత్రి బెడ్‌పై సమంత.. అసలేమైంది?
సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ వ్యాధినుంచి కోలుకుని ఇటీవల ఎంతో జోష్ తో కనిపించింది.
By: Tupaki Desk | 16 March 2025 5:07 PM ISTసమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ వ్యాధినుంచి కోలుకుని ఇటీవల ఎంతో జోష్ తో కనిపించింది. సోషల్ మీడియాలో తన నిరంతర ఫోటోషూట్లలో యాక్టివ్ నెస్ చూసి వ్యాధి నుంచి వందశాతం కోలుకుందని భావించారు అభిమానులు. కానీ ఇప్పుడు మరోసారి ఆస్పత్రి బెడ్ పై కనిపించి ఆశ్చర్యపరిచింది. ఆస్పత్రిలో కనిపించడమే కాదు.. చేతికి సెలైన్ కూడా ఎక్కుతోంది. దీంతో అభిమానులు కొంత ఆందోళన చెందారు. కానీ సమంత తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సందేశం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం ఈ ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఒక సుదీర్ఘ లేఖ పోయెటిక్ గా ఆకర్షించింది. ఇందులోనే అసలు సిసలు సారాంశం దాగి ఉంది. కానీ సెలైన్ తో సామ్ ని ఇలా చూడగానే, అభిమానులు ఇప్పుడు ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించిందా? అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి కొన్ని నెలల క్రితం అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత, సమంత సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‌తో తిరిగి యాక్టివ్ గా కనిపించింది. ప్రస్తుతం రక్త బ్రహ్మండ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. `మా ఇంటి బంగారం` అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. దీనిలో సామ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఆమె ప్రొడక్షన్ బ్యానర్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో నిర్మాతగా మొదటి ప్రాజెక్ట్ శుభంను ప్రారంభించింది.
అయితే ఇంత హుషారుగా ఉన్న సమంత ఇంతలోనే ఇలా ఆస్పత్రిలో ఎందుకు కనిపించింది? ఇది కేవలం జనరల్ చెకప్ మాత్రమేనా? ఇంకేదైనా సమస్య ఉందా? అన్నది వెల్లడించాల్సి ఉంది. సమంత పోస్ట్ చూస్తుంటే, చాలా నిగూఢంగా, చాలా సుదీర్ఘంగా ఉంది. సముద్రంలో కలిసే నది తన మార్గంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ, అన్నిటినీ ఎదుర్కొని చివరిగా సముద్రంలో కలుస్తుందని అర్థం వచ్చేలా ఒక నోట్ ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది సమంత. అయితే సముద్రంలో కలవాల్సిన నది ఎప్పటికీ దాని దిశను మార్చుకుని వెనక్కు వెళ్లలేదు! అని ఫియర్ ఫ్యాక్టర్ గురించి సమంత ప్రస్థావించింది. దీనిని బట్టి తనను అనారోగ్యం వెంబడిస్తున్నా కానీ, భయాలు ఎన్ని ఉన్నా కానీ, తాను మొక్కవోని ధీక్షతో అనుకున్న స్థాయికి ఎదుగుతాననే ధృఢమైన నమ్మకాన్ని సమంత వ్యక్తం చేస్తోందని అనుకోవచ్చు.