Begin typing your search above and press return to search.

బ్లాక్ లో సామ్ కిల్లింగ్ లుక్స్!

ఇప్పుడు త్వరలోనే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 7:41 AM GMT
బ్లాక్ లో సామ్ కిల్లింగ్ లుక్స్!
X

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు! స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఖుషీ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్.. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా సమంత కొత్త చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు త్వరలోనే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


స్పై యాక్షన్ జోనర్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్ లో సామ్.. లీడ్ రోల్ పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కు సరిసమానంగా నటించారు! సిరీస్ కోసం ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. షూటింగ్ టైమ్ లో హెల్త్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో తన యాక్టింగ్ తో అలరించారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో చితక్కొట్టారు.


ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సామ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ కలర్ బ్లేజర్, స్కర్ట్ వేసుకున్న అమ్మడు.. అందరి దృష్టిని ఆకర్షించారు. తన గ్లామర్ తో ఫిదా చేశారు. వెబ్ సిరీస్ టీమ్ తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు. అందుకు సంబంధించిన పిక్స్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈవెంట్ కు రెడీ అయిన అవుట్ ఫిట్ తో దిగిన మరిన్ని పిక్స్ కు సమంత తాజాగా షేర్ చేశారు. షైనీ ఎమోజీలను క్యాప్షన్ గా పెట్టారు.

కొత్త పిక్స్ లో సామ్ అదిరిపోయారు. కిల్లింగ్ లుక్స్ లో మెస్మెరైజ్ చేశారు. తన క్రేజీ ఫోజులతో అలరించారు. తన సొగసులతో ఫిదా చేశారు. చిన్న స్మైల్ ఇచ్చి మైండ్ బ్లాక్ చేశారు. స్టన్నింగ్ లుక్స్ తో ఫ్లాట్ చేశారు. స్కిన్ షో తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం

సమంత నయా పిక్స్.. నెట్టింట వైరల్ గా మారాయి. ముద్దుగుమ్మ ఫోటోస్ సూపర్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. చూపు తిప్పుకోలేక పోతున్నామని చెబుతున్నారు. లైక్స్. కొడుతూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.