అదో టెర్రర్ అందుకే సమంత ధైర్యం చేయలేదా!
అందుకే రిలీజ్ అనంతరం వెండి తెరపై తమని తాము చూసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.
By: Tupaki Desk | 26 Nov 2024 5:52 AM GMTసినిమాలంటే ఆసక్తి ఉన్న వారంతా తమని తాము ఎప్పుడు తెరపై చూసుకుందామా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎన్ని సినిమాల్లో నటించిన మరో కొత్త సినిమా ఆన్ సెట్స్ లో ఉంది? అంటే దాన్ని కొత్త సినిమాగానే భావించి పనిచేస్తుంటారు. ఔట్ పుట్ ఎలా వచ్చింది? అనే టెన్షన్..రిలీజ్ తర్వాత ఎలా నటించాను? అనే మరో రకమైన టెన్షన్ ఉండటం సహజం. అందుకే రిలీజ్ అనంతరం వెండి తెరపై తమని తాము చూసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.
కానీ సమంత వెబ్ సిరీస్ 'సీటాడెల్: హన్నీ బెన్నీ' విషయంలో మాత్రం సిరీస్ చూడాలంటేనే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలే ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి సమంత ఎందుకు ఆ సిరీస్ చూడాలనుకోవడం లేదో? ఆమె మాటల్లోనే..' ఇప్పటివరకూ 'సీటాడెల్' పూర్తిగా చూడలేదు. ఎందుకంటే నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు షూట్ కి హాజరయ్యాను. ఆ సెట్ లోఎన్నో కష్టమైన రోజులున్నాయి.
శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కున్నాను. ఇప్పుడీ సిరీస్ చూస్తే నన్ను ఆజ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి ఆ అనుభవాలన్నింటినీ మళ్లీ గుర్తు చేస్తుంది. ఇది నాకు ఎంతో బాధాకరంగా ఉంటుంది. అంతకు మించి కష్టంగా ఉంటుంది. మళ్లీ ఆ నాటి రోజుల్ని గుర్తు చేసుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఇప్పటి వరకూ కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమే చూసాను. ఆ తర్వాత ఆ సిరీస్ జోలికి వెళ్లలేదు' అని తెలిపింది.
ప్రస్తుతం సమంత 'రక్తబ్రహ్మాండ్' అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా సమంత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. సౌత్ లో అవకాశాలు వస్తున్నా? నటించడం లేదు. అందులోనూ తెలుగు సినిమాలు చేయాలని త్రివిక్రమ్ లాంటి వారే కోరుతున్నా? ఎందుకనో అమ్మడు మనసు మాత్రం హిందీ సినిమాలపైనే మళ్లించి పని చేస్తోంది.