Begin typing your search above and press return to search.

సమంత ఇంకా దూరం దూరం..!

తెలుగు, తమిళ్ లో స్టార్ డం కొనసాగించిన సమంత ఇక మీదట తన కెరీర్ అంతా కూడా బాలీవుడ్ లోనే అని అనేస్తుందట.

By:  Tupaki Desk   |   25 Dec 2024 6:30 PM GMT
సమంత ఇంకా దూరం దూరం..!
X

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత ఇప్పుడు ఆ సౌత్ ఇండస్ట్రీకి దూరమై పూర్తిగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయాలని భావిస్తుందని తెలుస్తుంది. తెలుగు, తమిళ్ లో స్టార్ డం కొనసాగించిన సమంత ఇక మీదట తన కెరీర్ అంతా కూడా బాలీవుడ్ లోనే అని అనేస్తుందట. సౌత్ లో ఇక సినిమాలు చేయడం కష్టమే అని అన్నట్టు చెబుతుంది. దీనికి కారణం సౌత్ లో చేస్తే సినిమాలు చేయాలి లేదంటే లేదు. కానీ బాలీవుడ్ లో అయితే సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అలరించే ఛాన్స్ ఉంటుంది.

సమంత చేసిన రెండు బాలీవుడ్ సీరీస్ లు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. రాజ్ అండ్ డీకేతో చేతులు కలిపి సమంత చేసిన మొదటి వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 సూపర్ సక్సెస్ కాగా కొద్దిపాటి గ్యాప్ తర్వాత సమంత చేసిన సిటాడెల్ హనీ బన్నీ కూడా సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్లో సక్సెస్ అంటే అది సినిమాల వల్లే కాదు వెబ్ సీరీస్ లతో కూడా పొందే ఛాన్స్ ఉందని కనిపెట్టిన సమంత ఇక మీదట అక్కడే వరుస వెబ్ సీరీస్ లను చేయాలని ఫిక్స్ అయ్యింది.

ఈ క్రమంలో తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా కూడా చేయడానికి ఆమె సుముఖంగా లేదని తెలుస్తుంది. సమంత ని ఆమె సౌత్ ఫ్యాన్స్ ఎంతో మిస్ అవుతున్నా కూడా తనకు నచ్చే కథ దొరికే వరకు ఇక్కడ సినిమాలు చేయడం కష్టమని తెలుస్తుంది. ఒకవేళ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అయితే మాత్రం తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి ఆఫర్లు వచ్చినా కూడా చేయడం కష్టమవుతుంది.

సమంత నిర్మాతగా మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది. ఐతే అది ప్రకటించి ఏడాది పైన అవుతున్నా కూడా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అందుకే సమంత సౌత్ సినిమాలకు దూరం దూరంగా బాలీవుడ్ కి దగ్గర దగ్గరగా ఉందనిపిస్తుంది. ఈమధ్య అమ్మడు ఎక్కువగా ముంబైలోనే స్పెండ్ చేస్తుంది. చూస్తుంటే అటు ఇటు తిరిగలేక పూర్తిగా ముంబై షిఫ్ట్ అయిపోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. ఐతే అలా చేస్తే మాత్రం సమంత సౌత్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతారు.