సమంత 15 ఏళ్ల జర్నీ.. స్టన్నింగ్ గోల్డెన్ లుక్
ఈ ప్రత్యేక గౌరవాన్ని అందుకున్న సమంత.. తన ఎమోషనల్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
By: Tupaki Desk | 2 March 2025 1:53 PM ISTటాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. 15 ఏళ్ల సినిమా ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు ప్రెస్టీజియస్ అవార్డు లభించింది. తాజాగా చెన్నైలో జరిగిన బిహైండ్ వుడ్స్ గోల్డ్ అవార్డ్స్ వేడుకలో, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ లోని ఆమె పాత్రకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. ఈ ప్రత్యేక గౌరవాన్ని అందుకున్న సమంత.. తన ఎమోషనల్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ అవార్డు ఫంక్షన్ కోసం సమంత ఎంచుకున్న లుక్ స్పెషల్ హైలైట్ గా మారింది. అద్భుతమైన గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయిన ఆమె లుక్ రాయల్ ఎలిగెన్స్ ను చూపించింది. మినిమల్ జువెలరీ, సింపుల్ మేకప్ తో తళుక్కున మెరిసిన సమంత.. తన స్టన్నింగ్ లుక్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఇంతకుముందు కూడా ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో మెస్మరైజ్ చేసిన సమంత.. ఈసారి మరింత గ్లామరస్ గా కనిపించింది.

15 ఏళ్ల ఫిల్మీ కెరీర్ లో సమంత అనేక రోల్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఆమె కెరీర్ లో 'ఏ మాయ చేసావే' ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచీ ఆమెకు వరుసగా విజయాలు దక్కాయి. ఆ తర్వాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'మనమ్', 'రంగస్థలం', 'మజిలీ' లాంటి బ్లాక్ బస్టర్స్ తో తన స్థాయిని మరింత పెంచుకుంది. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ తో కొత్త అవతారం ఎత్తింది.

ప్రస్తుతం సమంత వ్యక్తిగతంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ తో బ్రేక్ తీసుకున్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది. ఇటీవల ఆమె తన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే వెండితెరపై మరిన్ని సినిమాలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే మరో అప్డేట్ ఇవ్వనుందట.