Begin typing your search above and press return to search.

సమంతకు గాయం.. ఏం జరిగింది..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. గత కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Sep 2024 6:01 PM GMT
సమంతకు గాయం.. ఏం జరిగింది..
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. గత కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. యశోద మూవీ టైమ్ లో మయోసైటిస్ బారినపడిన విషయం తెలియగా.. కొద్ది రోజులు బ్రేక్ తీసుకుని షూటింగ్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత అప్పటికే కమిట్ అయ్యి ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ తర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లిపోయింది. కొన్నిరోజులు అక్కడే గడిపి, విశ్రాంతి తీసుకుని ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది.

అదే సమయంలో ఓ పాడ్ కాస్ట్ ను స్టార్ట్ చేసి.. అందులో హెల్త్ కు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. తన ఫాలోవర్స్ కోసం కొత్త పిక్స్ షేర్ చేస్తుంటోంది. పలు విషయాలపై రియాక్ట్ అవుతుంటోంది. రీసెంట్ గా కేరళలో దుమారం రేపుతున్న హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించింది. టాలీవుడ్ లో కూడా అలాంటి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరి అందరికీ షాక్ ఇచ్చింది.

కాగా, సమంత లేటెస్ట్ ఇన్ స్టా స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీడిల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేసింది. గాయాలు లేకుండా తాను యాక్షన్ స్టార్ కాగలనా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ టైమ్ లో సామ్ గాయపడ్డట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఏ సినిమా షూట్ లో గాయపడిందో చెప్పలేదు. అయితే సమంత ఫ్యాన్స్ ఆమె గాయం పట్ల ఆందోళన చెందుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ కు గాయం కావడం బాధగా ఉందని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే తన బర్త్ డే సందర్భంగా సమంత.. కొత్త మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మా ఇంటి బంగారం పేరుతో సినిమాను ప్రకటించింది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందనున్నట్లు తెలిపింది. అయితే ఆ మూవీ షూటింగ్ లోనే సామ్ గాయపడిందోమోనని కొందరు ఫ్యాన్స్ అనుమానపడుతున్నారు.

అయితే సమంత ఇప్పటికే కంప్లీట్ చేసిన హనీ బన్నీ సిటాడెల్ వెబ్ సిరీస్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్.. యాక్షన్ థ్రిల్లర్ గా సందడి చేయనుంది. నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు సహా అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది. సిటాడెల్ సిరీస్ కోసం బాగా కష్టపడ్డట్లు పలుమార్లు తెలిపింది సమంత. మరి ఆ సిరీస్ తో ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి.