Begin typing your search above and press return to search.

కొండా సురేఖ వ్యవహారంపై మరోసారి సామ్ ఇలా..

స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:32 AM GMT
కొండా సురేఖ వ్యవహారంపై మరోసారి సామ్ ఇలా..
X

స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. చైతూ, సామ్ విడిపోవడానికి భారాస లీడర్ కేటీఆర్ కారణమని ఆమె ఆరోపణలు చేయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాగార్జున కుటుంబ సభ్యులంతా కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. సమంత కూడా స్పందించారు. తన విడాకుల విషయంలో రాజకీయ ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు మరోసారి ఆ విషయంపై సామ్ రెస్పాండ్ అయ్యారు. తన అప్ కమింగ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడారు. కొండా సురేఖ వివాదాన్ని రిపోర్టర్ ప్రస్తావించగా.. తాను ఇక్కడ కూర్చోవడానికి ఎంతో మంది మద్దతు కారణమని తెలిపారు సమంత. తనపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది చూపించిన ప్రేమ తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని సామ్ చెప్పారు. త్వరగా ఆ వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసిందన్నారు.

కష్టాలను ఎదుర్కోవడంలో ఇండస్ట్రీ మద్దతు తనకు చాలా సహాయపడిందని తెలిపారు సమంత. వారు సహాయం చేయకుండా ఉంటే.. తాను కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేదని అన్నారు. మరింత కుంగిపోయేదాన్ని అని చెప్పారు. అందరి మద్దతుతో తాను ఇక్కడ ఈరోజు ఇలా కూర్చున్నానని పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్న వారి నమ్మకం వల్ల గట్టిగా ఎదుర్కోగలిగానని చెప్పారు. ప్రస్తుతం సమంత లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అదే సమయంలో ఆన్ లైన్ ట్రోలింగ్ పై కూడా స్పందించారు సామ్. అలాంటి వాటి గురించి అసలు ఎక్కువగా ఆలోచించనని చెప్పారు. ద్వేషపూరిత సందేశాలు వచ్చినప్పుడు.. వాటి ఎఫెక్ట్ తనపై పడకుండా చూసుకుంటానని తెలిపారు. అందుకు జాగ్రత్త పడతానని అన్నారు. ట్రోలింగ్ చేసే వారు కూడా అలాంటి బాధను అనుభవించి ఉంటారేమో అన్న కోణంలో ఆలోచిస్తానని తెలిపారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తనపై ప్రభావం పడకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.

ఇక సిటాడెల్ సిరీస్ విషయానికొస్తే.. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో తెరకెక్కగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్ పోషించారు. అందుకోసం ప్రత్యేకంగా సామ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. రీసెంట్ గా 11 నిమిషాల ఇంటెన్స్‌ యాక్షన్‌ సీన్ ను సింగిల్ ల్ టేక్‌ లో ఎలాంటి కట్స్‌ లేకుండా చిత్రీకరించినట్లు వరుణ్ తెలిపారు. దీంతో సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి.