అలాంటి వాటికి నా జీవితంలో చోటే లేదు: సమంత
విడాకుల తర్వాత సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడం, దాని ట్రీట్‌మెంట్ కోసం సమంత కొన్నాళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉండటం జరిగాయి.
By: Tupaki Desk | 5 Feb 2025 7:30 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. విడాకుల తర్వాత సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడం, దాని ట్రీట్‌మెంట్ కోసం సమంత కొన్నాళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉండటం జరిగాయి.
ఇప్పుడు మళ్లీ సమంత నార్మల్ అయిపోగా.. నాగచైతన్య శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. అయితే తాజాగా సమంత తన మాజీ భర్త కొత్త రిలేషన్ లోకి వెళ్లడంపై మాట్లాడింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్ నుంచి బయటికొచ్చి లైఫ్ లో ముందుకెళ్లడం గురించి ప్రశ్న ఎదురవగా, దానికి సమంత స్పందించింది.
ఆ బాధ నుంచి బయటకు రావడానికి తాను చాలా కష్టపడినట్టు సమంత చెప్పుకొచ్చింది. మాజీ భర్త కొత్త బంధంలోకి వెళ్లినందుకు మీరేమైనా అసూయ పడుతున్నారా అని అడగ్గా, తన జీవితంలో అసూయకు చోటు లేదని, తన లైఫ్ లో ఎప్పటికీ అసూయ అనేది ఉండదని, ఏదైనా చెడు జరుగుతుందంటే దానికి మూల కారణం అసూయే అని నమ్ముతానని, అయినా అలాంటి వాటి గురించి తాను పెద్దగా ఆలోచించనని సమంత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
అయితే నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన గురించి మాట్లాడటం సమంతకు ఇది మొదటి సారేమీ కాదు. తాను ప్రైమ్ వీడియో కోసం చేసిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ ప్రమోషన్స్ లో కూడా అవసరం లేకపోయినా మీరు ఎక్కువ ఖర్చు దేని కోసం పెట్టారని వరుణ్ ధావన్ అడగ్గానే తన ఎక్స్‌కు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్టుల కోసమని చెప్పింది. ఆ కామెంట్స్ అప్పట్లో నెట్టంట వైరలయ్యాయి.
దాని కంటే ముందు కరణ్ జోహార్ షో లో కూడా సమంత నాగ చైతన్యపై కామెంట్ చేసింది. తను, తన మాజీ ఒకే రూమ్ లో ఉంటే దగ్గర్లో కత్తులు ఉండకపోవడం మంచిదని చెప్పింది. అవసరమున్నా లేకపోయినా నాగ చైతన్యతో విడిపోయాక సమంత తన గురించి కామెంట్స్ చేస్తూనే ఉండగా, మరోవైపు నాగ చైతన్య మాత్రం సమంతకు లైఫ్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు ఓసారి మీడియా అడిగినప్పుడు ఆమె ప్రస్తావన తెచ్చాడు.
ఇక సమంత కెరీర్ విషయానికొస్తే రీసెంట్ గా హనీ బన్నీతో ప్రేక్షకుల్ని అలరించిన సమంత, మా ఇంటి బంగారం అనే సినిమాను సొంత బ్యానర్ లో అనౌన్స్ చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం దాని గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. దాంతో పాటూ రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ లో కూడా సమంత నటిస్తోంది.