Begin typing your search above and press return to search.

ఆ మూడింట్లో నిజాయితీగా ఉంటే క‌ష్టాలు ద‌రి చేర‌వు

ఓవైపు మ‌యోసైటిస్‌తో ఇబ్బంది ప‌డుతూనే, విడాకుల‌తో వ్య‌క్తిగ‌తంగా మాన‌సిక ఇబ్బందిని ఎదుర్కొంది. ఒకేసారి ఇవ‌న్నీ గోరుచుట్టుపై రోక‌టిపోటులా మారాయి.

By:  Tupaki Desk   |   23 Jan 2025 7:30 PM GMT
ఆ మూడింట్లో నిజాయితీగా ఉంటే క‌ష్టాలు ద‌రి చేర‌వు
X

సృష్టిలో ప్ర‌తి ప్రాణికి ఏదో ఒక క‌ష్టం ఉంటుంది. ఇక మ‌నుషుల‌కు క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోగాలు రొష్టుల‌కు ఆర్థిక క‌ష్టాలు అద‌నం. అయితే దేనినైనా అధిగ‌మించే మానసిక సంసిద్ధ‌త చాలా ముఖ్యం. అలాంటి సంసిద్ధ‌త‌తో చాలా క‌ష్టాల‌ను అధిగ‌మించింది స‌మంత రూత్ ప్ర‌భు. ఓవైపు మ‌యోసైటిస్‌తో ఇబ్బంది ప‌డుతూనే, విడాకుల‌తో వ్య‌క్తిగ‌తంగా మాన‌సిక ఇబ్బందిని ఎదుర్కొంది. ఒకేసారి ఇవ‌న్నీ గోరుచుట్టుపై రోక‌టిపోటులా మారాయి.

అయితే ఎలాంటి క‌ష్టాన్ని అయినా అధిగమించడానికి సమంత తాను పాటించే మంత్రం ఏమిట‌న్న‌ది తాజా చాటింగ్ సెష‌న లో వెల్లడించింది. ''ఇది చాలా సులువుగా ఉంటుంది కానీ శ‌క్తివంత‌మైన‌ది.. రిజ‌ల్ట్ ఇస్తుంద‌``ని స‌మంత చెబుతోంది. 'కృతజ్ఞత -ఆనందం' అనే శీర్షికతో స‌మంత ఇన్‌స్టాలో ఇలా రాసింది.

గ‌డిచిన రెండేళ్లుగా ఈ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నాను. దీనితో కష్ట కాలంలో కొన్నింటిని అధిగమించ‌గ‌లిగాను. ఇది సింపుల్ గా ఉన్నా కానీ శక్తివంతమైనది. అభిమానుల‌ను కృతజ్ఞతతో కూడుకున్న మూడు విషయాలను రాయమని సూచించింది. రాత మీకు స‌హ‌జంగా వ‌స్తే .. మూడు విష‌యాలు రాయండి. అవి పెద్దగా ఉండనవసరం లేదు.. నిజాయితీగా ఉండాలి. కానీ రాయడం కష్టంగా లేదా బలవంతంగా అనిపించినా అలా కూడా పర్వాలేదు. న‌మ్మ‌కంగా ఉండే వారితో మ‌న‌సులో విష‌యాల‌ను షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మీ హృదయంలో సైలెంట్ గా థాంక్స్ అని చెప్పుకోండి.

ఈ సూచ‌న చాలా సులువుగా చిన్న‌దిగా అనిపించ‌వ‌చ్చు కానీ, మీ దృక్పథాన్ని అమాంతం మార్చేస్తుంద‌ని స‌మంత తెలిపింది. మీరు ప్రతిదాన్ని చూసే విధానాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. దీన్ని ఒకసారి ప్రయత్నించండి. ఇది నాకు గేమ్ ఛేంజర్‌గా మారింది.. అని నోట్ ని ముగించింది. ఈ రోజు మీరు దేనికి కృతజ్ఞతతో ఉన్నారో నాతో షేర్ చేసుకోండి.. అని కూడా వ్యాఖ్యానించింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సమంత సిటాడెల్ హ‌నీ బ‌న్నీతో నిరూపించిన త‌ర్వాత‌, ప్రస్తుతం `మా ఇంటి బంగారం` చిత్రీక‌ర‌ణ‌పై ప‌ని చేస్తోంది. ఈ సినిమాతో నిర్మాత‌గాను నిరూపించుకోవాల‌ని త‌పిస్తోంది.