Begin typing your search above and press return to search.

నవంబర్‌లోనూ ప్రభాస్‌, సమంత నెం.1

ప్రతి నెలలోనూ సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలను వెళ్లడించే ఆర్‌మాక్స్‌ సంస్థ నవంబర్‌ నెలకు సంబంధించిన వివరాలను వెళ్లడించింది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 11:38 AM GMT
నవంబర్‌లోనూ ప్రభాస్‌, సమంత నెం.1
X

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఆర్‌మాక్స్ సంస్థ ప్రతి నెల మోస్ట్‌ పాపులర్‌ సెలబ్రెటీ, మోస్ట్‌ పాపులర్ మూవీ.. ఇలా వివిధ కేటగిరీల్లో టాప్ 10 జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఎన్నో కేటగిరీల్లో ఈ సంస్థ టాప్‌ 10 జాబితాను విడుదల చేసినా ఎక్కువ శాతం మంది మాత్రం హీరోల్లో టాప్‌ 10, హీరోయిన్స్‌ లో టాప్‌ 10, సినిమాల్లో టాప్‌ 10 కేటగిరీల్లో ఏం ఉంది, ఎవరు ఉన్నారు అనే విషయాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి నెలలోనూ సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలను వెళ్లడించే ఆర్‌మాక్స్‌ సంస్థ నవంబర్‌ నెలకు సంబంధించిన వివరాలను వెళ్లడించింది.

సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో హీరోయిన్స్‌ టాప్‌ 10 జాబితాలో సమంత నెం.1 స్థానంలో ఉంది. గత మూడు నెలలుగా ఆమె సిటాడెల్‌ కి సంబంధించిన హడావిడితో బిజీగా ఉంది. అందుకే ఆమె గురించి సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేల సంఖ్యలో ట్వీట్స్ పడుతూ ఉంటాయి. అందుకే ఆమెకు ఏకంగా మూడు నెలలుగా నెం.1 స్థానం దక్కింది. నవంబర్‌ నెలలోనూ సమంత నెం.1 స్థానంలో ఉండటం ఆమె ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చే విషయం. ఇక హీరోల టాప్ 10 జాబితాలోనూ వరుసగా మూడు నెలల పాటు ప్రభాస్ నెం.1 స్థానంలో ఉండటం మనం చూడవచ్చు. బాలీవుడ్‌ స్టార్స్‌ ను సైతం పక్కకు నెట్టి ప్రభాస్ ఈ చోటు సొంతం చేసుకున్నారు.

హీరోయిన్స్‌ జాబితాలో సమంత నెం.1 స్థానంలో ఉండగా నెం.2 స్థానంను బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్ దక్కించుకున్నారు. మూడో స్థానంలో నయనతార నిలిచింది. ధనుష్‌ తో వివాదం కారణంగా ఆమె గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. ఇక నాల్గవ స్థానంలో అమరన్ స్టార్‌ సాయి పల్లవి నిలిచింది. ఆమె గురించి సినిమా విడుదల అయినప్పటి నుంచి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా దీపికా పదుకునే, త్రిష, కాజల్‌, రష్మిక, శ్రద్దా కపూర్‌, కత్రీనా కైఫ్‌లు నిలిచారు. ఈ జాబితాలో సౌత్ హీరోయిన్స్ పలువురు ఉండటం విశేషం.

హీరోల టాప్ 10 జాబితాలో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ప్రభాస్ నెం.1 స్థానంలో ఉండగా తమిళ్ సూపర్ స్టార్‌, రాజకీయాల్లో అడుగు పెట్టి చర్చనీయాంశంగా మారిన విజయ్‌ నెం.2 స్థానంలో ఉన్నారు. పుష్ప 2 సినిమా కారణంగా అల్లు అర్జున్‌ నెం. 3 స్థానంలో ఉన్నాడు. ఆయన సినిమా ప్రమోషన్స్‌ కోసం దేశం మొత్తం తిరగడం వల్ల నవంబర్‌లో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్‌ బాద్‌ షారుఖ్‌ ఖాన్‌ 4వ స్థానంలో నిలిస్తే దేవర స్టార్‌ ఎన్టీఆర్‌ 5వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో అజిత్, మహేష్ బాబు, సూర్య, రామ్‌ చరణ్‌, అక్షయ్‌ కుమార్‌లు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 8 మంది సౌత్‌ స్టార్స్ ఉండటం విశేషం. అందులోనూ ఐదుగురు టాలీవుడ్‌ స్టార్స్ ఉండటం ఇక్కడ ప్రత్యేకం.