ఒక నటి ఒక దర్శకుడు కలిసి కనిపిస్తే చాలు..!
ఇప్పుడు కూడా ఫ్యామిలీమ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత స్నేహంపై రకరకాల కామెంట్లను వైరల్ చేస్తోంది బాలీవుడ్ మీడియా.
By: Tupaki Desk | 4 Feb 2025 4:09 AM GMTఒక నటి.. ఒక నటుడు లేదా దర్శకుడు కలిసి కనిపిస్తే చాలు.. వెంటనే పుకార్లు మొదలైపోతున్నాయి. జంటగా కలిసి కనిపిస్తే చాలు బాలీవుడ్ మీడియా షంటుతోంది.. అందులో నిజం ఎంత? కేవలం స్నేహం మాత్రమేనా లేదా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరైనా డేటింగ్ ని కన్ఫామ్ చేసారా? ఇలాంటి వాటితో హిందీ మీడియాకు సంబంధం లేదు. రెగ్యులర్ పుకార్లతో వీళ్లకు అదే పని..స్నేహం సచ్చీలత గురించి పట్టించుకోరు అక్కడ.. ఇష్టానుసారం ఊహాగానాలు వైరల్ చేయడం రెగ్యులర్ గా చూసేదే..
ఇప్పుడు కూడా ఫ్యామిలీమ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత స్నేహంపై రకరకాల కామెంట్లను వైరల్ చేస్తోంది బాలీవుడ్ మీడియా. ఏడాది కాలంగా హిందీ మీడియాలో ఈ పుకార్లు మరీ ఎక్కువయ్యాయి. ఇలాంటి డేటింగ్ పుకార్ల మధ్య సమంత ఇటీవల జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్ లో సందడి చేసినప్పటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, వీటిలో రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు. సమంత షేర్ చేసిన ఫోటోల బంచ్ లో ఒక ఫోటోలో సామ్ దర్శకుడు రాజ్ చేయి పట్టుకుని ఉన్నట్లు కనిపించింది. ఇది డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. రెడ్డిట్ లో ఆ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ హంగామా మరింత పీక్స్ కి చేరుకుంది.
నిజానికి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో ఆ ఇద్దరూ ఎంతో సందడిగా కనిపించారు. దీనికి బాలీవుడ్ మీడియా ఎప్పటిలానే చాలా అర్థాలు వెతుకుతోంది. సమంత ఫ్యామిలీమ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకేలతో చాలా కాలంగా స్నేహం కొనసాగిస్తున్నారు. ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్ హనీ బన్ని వెబ్ సిరీస్ ల కోసం ఆ ఇద్దరూ కలిసి పని చేసారు. ప్రస్తుతం రక్త్ భ్రహ్మాండ్ అనే సిరీస్ కోసం కలిసి పని చేస్తున్నారు. టాలీవుడ్ లో దర్శకులు రాజ్ అండ్ డీకే పలు సినిమాలను కూడా తీసారు. అప్పటి నుంచి కథానాయికలతో మంచి ఫ్రెండ్షిప్ లు ఉన్నాయి. కానీ హిందీ మీడియా ప్రతిదానిని హైలైట్ చేస్తూ గాసిప్పులు వండి వారుస్తోంది.
రాజ్ అండ్ డీకే ఎక్కువ సవాళ్లతో కూడుకున్న పాత్రల్లో అవకాశాలిస్తున్నారని సమంత ఇంతకుముందు వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఫ్యామిలీ మ్యాన్‌తో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రను చేయగలిగాను. మళ్ళీ సిటాడెల్ హనీ బన్నీ లో పాత్ర ఇంతకు ముందు చేయనిది. మళ్ళీ రక్త్ బ్రహ్మండ్‌తో మరింత సవాల్ అనిపించే పాత్రను ఆఫర్ చేసారు. రాజ్ & డికె నన్ను శాశ్వతంగా సవాళ్లను కోరుకునేలా ప్రేరేపించారు.. అని సమంత అన్నారు. సమంత రూత్ ప్రభు 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు, అయితే, వారు 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే.