సమంతతో ఆ దర్శకుడు.. రూమర్స్ మధ్య ఫొటోస్ వైరల్!
అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 3 Feb 2025 4:29 AM GMTటాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆమె నుంచి పెద్దగా సినిమాలు రాకపోయినా వ్యక్తిగత జీవితం, వ్యాపార ప్రాజెక్టులు, ఆరోగ్య పరిస్థితి ఇలా అన్ని విషయాల్లోనూ ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఇక ఇటీవల సమంత పిక్ల్ బాల్ అనే క్రీడలో ప్రవేశించడం కొత్త చర్చకు తెరలేపింది. సమంత తాజాగా వరల్డ్ పిక్ల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ చాంప్స్ ను కొనుగోలు చేసి స్పోర్ట్స్ ఫీల్డ్‌లో అడుగుపెట్టింది.
అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల ప్రత్యేకత ఏంటంటే, సమంతతో పాటు దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించడం. రాజ్-డీకే దర్శకత్వ ద్వయానికి చెందిన రాజ్, స్పెషల్ గా సమంతతో కలిసి చెన్నై టీమ్‌ను ఉత్సాహపరిచారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందనే ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు సమంత పిక్ల్ బాల్ మ్యాచ్లో రాజ్‌తో కలిసి కనిపించడంతో ఈ రూమర్స్‌కు మరింత వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఉన్న బాండింగ్, స్నేహం కేవలం వర్క్ వరకు మాత్రమేనా? లేక వేరేలా మారిందా? అనే చర్చ నడుస్తోంది. సమంత, రాజ్ ఇప్పటికే ది ఫ్యామిలీ మాన్ 2, సిటాడెల్: హనీ బన్నీ ప్రాజెక్టులు చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో వీరి సాన్నిహిత్యం ఎక్కువైందనే టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, సమంత విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారనే వార్తలు నిజమవుతాయి. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ఎక్కువయ్యాయి. కానీ ఆమె తన కెరీర్‌పైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు స్పోర్ట్స్ ఫీల్డ్‌లో కూడా ఓనర్ గా మారడం ఆసక్తికర పరిణామం.
ఇక ఈ రూమర్స్ మధ్య సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నై సూపర్ చాంప్స్ మ్యాచుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. ఫోటోలతో పాటు తన అనుభవాలను కూడా వివరించారు. "ఇది నాకు కొత్త ప్రపంచం. చిన్నప్పటి నుంచి క్రీడలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఇప్పుడు ఈ పిక్ల్ బాల్ గేమ్ నాకు కొత్త చూపును ఇచ్చింది. ఓడిపోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ స్పోర్ట్స్ అంటే కేవలం గెలుపోటముల గురించి కాకుండా కొత్తదనం నేర్చుకోవడమని ఈ అనుభవం నాకు తెలిపింది. రాజ్, హిమాంక్ లాంటి అద్భుతమైన టీమ్‌మేట్స్‌తో కలిసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించాను" అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా చైతన్య జీవితంలో కూడా పెద్ద మార్పు చోటుచేసుకుంది. షోభిత ధూళిపాళాతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న చైతన్య, 2024 డిసెంబర్‌లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక నాగచైతన్య - సమంత ఇద్దరు కూడా వారి వ్యక్తిగత లైఫ్ లో చాలా బిజిగానే ఉన్నారు. స్నేహపూర్వకంగానే విడిపోయినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నాగచైతన్య ఈ నేపథ్యంలో సమంత కూడా కొత్త జీవితానికి మళ్లిపోతున్నారా? అనే ఆసక్తి నెలకొంది. సమంత, రాజ్ నిడిమోరు మధ్య నిజంగా ఏదైనా ఉందా? లేక కేవలం వ్యాపార సంబంధమేనా? అనేది తేలాల్సి ఉంది. కానీ, పిక్ల్ బాల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడమే అభిమానుల్లో చర్చలకు కారణమైంది. మరి సమంత ఈ వార్తలపై స్పందిస్తారా? లేదా కేవలం తన పనిపైనే దృష్టి పెడతారా? అనేది చూడాలి.