సమంత కుట్రలు కుతంత్రాలు
సమంతతో భారీ షెడ్యూళ్ల కోసం కలిసి పని చేసారు. ఈ కలయిక బ్లాక్ బస్టర్ కలయిక. `హనీ బన్నీ` త్వరలోనే స్ట్రీమింగుకి రెడీ అవుతోంది.
By: Tupaki Desk | 21 Sep 2024 6:02 AMసమంత- రాజ్ అండ్ డీకే కాంబినేషన్ గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకుముందు ఫ్యామిలీమ్యాన్ 2లో సమంతకు అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకే ఆ వెంటనే సిటాడెల్ ఇండియన్ వెర్షన్ `హనీబన్నీ` కోసం మరో అవకాశం కల్పించారు. సమంతతో భారీ షెడ్యూళ్ల కోసం కలిసి పని చేసారు. ఈ కలయిక బ్లాక్ బస్టర్ కలయిక. `హనీ బన్నీ` త్వరలోనే స్ట్రీమింగుకి రెడీ అవుతోంది.
ఇంతలోనే ఇప్పుడు రాజ్ అండ్ డీకేతో మరో వెబ్ సిరీస్ కోసం సమంత సర్వసన్నాహకాల్లో ఉంది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్- ది బ్లడీ కింగ్‌డమ్ పేరుతో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే బృందం ఈ సిరీస్ చిత్రీకరణను ఇప్పటికే ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం, రాజ్ & DK నిర్మాణ సంస్థ D2R ఫిల్మ్స్ పెట్టుబడులు సమకూరుస్తోంది. రాహి అనిల్ బార్వే , దీర్ఘకాల సహకారి సీతా R మీనన్‌తో భాగస్వామితో కలిసి ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ఆద్యంతం రక్త పాతానికి దారి తీసే పరిస్థితులను తెరపై అద్బుతంగా ఆవిష్కరించనున్నారని సమాచారం. రక్తపాత రాజ్యంలో కుట్రలు కుతంత్రాలు, ద్రోహాలు రక్తి కట్టిస్తాయని చెబుతున్నారు. ఫ్యామిలీమ్యాన్ తరహాలో గ్రిప్పింగ్ స్టోరీతో ఈ సిరీస్ ని నడిపించబోతున్నారు. దీనిలో ఆదిత్య రాయ్ కపూర్, సమంతా రూత్ ప్రభు, అలీ ఫజల్, వామికా గబ్బి తదితర తారాగణం నటిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రీప్రొడక్షన్ కోసం టీమ్ చాలా కష్టపడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాన నటులు, ఆదిత్య రాయ్ కపూర్ -సమంతా రూత్ ప్రభు తమ పాత్రలను పరిపూర్ణంగా మలుచుకునేందుకు కఠినమైన కత్తి-యుద్ధ శిక్షణను తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు తమ పాత్రలకు తెరపై జీవం పోస్తున్నప్పుడు వారి నైపుణ్యాలకు పరీక్ష ఎదురు కానుంది. ది ఫ్యామిలీ మ్యాన్ మూడవ సీజన్ తో కలిసి రక్త బ్రహ్మాండ్ ని ఏకకాలంలో చిత్రీకరించాలనే డిమాండ్ ఉంది. కానీ రాజ్ నిడిమోరు- కృష్ణ DK `రక్త్ బ్రహ్మాండ్ - ది బ్లడీ కింగ్‌డమ్`లోని ప్రతి అంశాన్ని పర్యవేక్షించడంలో నిమగ్నమై ఉన్నారు. సృష్టికర్తలు హాస్యం, యాక్షన్, ఆకట్టుకునే కథనాలను మిళితం చేయగల సమర్థతతో ఇప్పటికే మెప్పించారు. కొత్త వెబ్ సిరీస్ లోను అవేవీ మిస్ కావని చెబుతున్నారు.
మిడ్-డే కథనం ప్రకారం.. రక్త్ బ్రహ్మాండ్ అనేది కల్పిత రాజ్యంలో సాగే యాక్షన్ ఫాంటసీ సిరీస్. వారు ది ఫ్యామిలీ మ్యాన్‌ని చిత్రీకరిస్తున్నప్పటికీ `రక్త్ బ్రహ్మాండ్` స్క్రిప్ట్ పురోగతిని నిరంతరం పర్యవేక్షించారు. ఇలాంటిది పూర్తి స్థాయిలో వారు ఇంతకు ముందు ప్రయత్నించలేదు. మేము రెండు వారాల క్రితం షూటింగ్ ప్రారంభించాము. ప్రస్తుతం బోరివలిలోని బాహుబలి స్టూడియోలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాము. త్వరలో 10 రోజుల చిన్న విరామం ఉంటుంది. దాని తర్వాత అక్టోబర్‌లో మళ్లీ షెడ్యూల్ చేస్తాము. ఫిబ్రవరి 2025 వరకు ఈ సెట్‌లో అలాగే నగరంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కువ భాగం షూట్ జరుగుతుంది.. అని తెలిపారు.