Begin typing your search above and press return to search.

స‌మంత టాలీవుడ్ కి ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే!

ఆమెను ఎంతో గొప్ప నటిగానూ త్రివిక్ర‌మ్ గుర్తిస్తారు. మ‌రి గురూజీ మాట ప్ర‌కారం స‌మంత మ‌ళ్లీ తెలుగు సినిమాలు చేస్తుందా అంటే అది ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌లేదు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 9:30 PM GMT
స‌మంత టాలీవుడ్ కి ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే!
X

స‌మంత టాలీవుడ్ లో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ రిక్వెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా స‌మంత ముంబైలోనే ఎక్కువ‌గా ఉండిపోవ‌డంతో ముంబైనే కాదు అప్పుడ‌ప్పుడు హైద‌రాబాద్ కూడా వ‌చ్చి తెలుగు సినిమాలు చేయాల‌ని ప‌బ్లిక్ గానే త్రివిక్రమ్ కోరాడు. అంత వ‌ర‌కూ ఏ ద‌ర్శ‌కుడు ఆమెని తెలుగు సినిమాలు చేయ‌మ‌ని అడ‌గ‌లేదు. తొలిసారి గురూజీని అడిగే స‌రికి స‌ర్ ప్రైజ్ గా అనిపించింది. అయితే అప్ప‌టికే స‌మంత‌తో గురూజీ కొన్ని సినిమాలు చేసారు.

ఆమెను ఎంతో గొప్ప నటిగానూ త్రివిక్ర‌మ్ గుర్తిస్తారు. మ‌రి గురూజీ మాట ప్ర‌కారం స‌మంత మ‌ళ్లీ తెలుగు సినిమాలు చేస్తుందా అంటే అది ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌లేదు. స‌మంత న‌టించిన `శాకుతలం`, `ఖుషీ` గ‌త ఏడాది రిలీజ్ అయ్యాయి. రెండు పెద్ద‌గా ఫ‌లితాలు సాధించ‌లేదు. ఆ త‌ర్వాత అమ్మ‌డు అమెరికా వెళ్లిపోయింది. ఏడాది పాటు అమెరికాలోనే ఉంది. ఆ త‌ర్వాత నేరుగా అమెరికా నుంచి ముంబైకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ముంబైలోనే ఉంటుంది.

అప్ప‌టికే కొన్ని హిందీ వెబ్ సిరీస్ లు...సినిమాల‌కు సైన్ చేసింది. ప్ర‌స్తుతం వాటి ప‌నుల్లోనే బిజీగా ఉంది. అప్ప‌టి నుంచి అమ్మ‌డు మ‌ళ్లీ హైద‌రాబాద్ వ‌చ్చింది లేదు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం అప్పుడ‌ప్పుడు వైవిథ్య మైన పోస్టులు పెడుతూ కాస్త వివాదాస్ప‌దంగానూ మారుతుంది. ఆ కార‌ణంగా కొంత నెగిటివిటీని ఎదుర్కుంటుంది. ఆమె పెట్టే పోస్టులు టాలీవుడ్ లో ఓ ఇద్ద‌ర్ని ప్ర‌త్యేకంగా టార్గెట్ చేస్తున్నాయ‌నే ఆరోప‌ణ వినిపిస్తుంది.

మ‌రి ఇలాంటి స‌మ‌యంలో స‌మంత మ‌ళ్లి తెలుగు సినిమాల వైపు చూస్తుందా అంటే నో ఛాన్స్ అనే మాట వినిపిస్తుంది. తెలుగులో ఆమె ఎరా కొంత కాలంగా సాగింది. ఆమె ఇప్పుడు తెలుగు కంటే హిందీ లోనే సంచ‌ల‌నం అవ్వాల‌నే ప్లానింగ్ తో ఉంద‌ని...తెలుగులో ఎంత పెద్ద ఆఫ‌ర్ వ‌చ్చినా చేసే అవ‌కాశాలు లేవ‌నే మాట వినిపిస్తుంది.