Begin typing your search above and press return to search.

సమంత లైఫ్.. నాగచైతన్య గుర్తులు ఇంకా అలానే..

టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా ఎదిగిన సమంత తన వ్యక్తిగత జీవితం విషయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది.

By:  Tupaki Desk   |   11 March 2025 3:32 PM IST
సమంత లైఫ్.. నాగచైతన్య గుర్తులు ఇంకా అలానే..
X

టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా ఎదిగిన సమంత తన వ్యక్తిగత జీవితం విషయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేయడమే కాకుండా, ఫ్యాషన్, వ్యక్తిగత జీవితం పరంగా కూడా ఆమె ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.

తాజాగా, తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను పెండెంట్‌గా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక ఆభరణపు మార్పు కాదు, తన కొత్త జీవితానికి ఇచ్చిన చిహ్నంగా కూడా భావించాలి. ఇక ఆమె మెడలో వేసుకునే గోలుసుకు జత చేసి ధరించినట్లు తెలుస్తోంది. సమంత, నాగ చైతన్యకు సంబంధించిన ఏ విషయం అయినా వెంటనే వైరల్ అవుతోంది. విడాకుల అనంతరం ఆమె చేతికి ఉన్న మూడు క్యారెట్ల డైమండ్ రింగ్ మాయం కావడంతో, అభిమానులు అనేక ఊహాగానాలు మొదలుపెట్టారు.

ఈ రింగ్‌ను ఆమె ఇక ఉపయోగించరని అర్థమైంది. కానీ, అది పూర్తిగా వదిలిపెట్టకుండా, ఒక మెడలో నెక్లెస్ లా మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇది ఆమె గతాన్ని మర్చిపోవడం కాదు, దానిని ఒక కొత్త అర్థంతో తన జీవితంలో నిలబెట్టుకోవడమనే అభిప్రాయాన్ని ఇస్తోంది. విడాకుల తర్వాత ఎంగేజ్‌మెంట్ రింగులను రీడిజైన్ చేసుకోవడం నేటితరం వారికి కొత్త ట్రెండ్ గా మారింది.

ఇదే విధంగా, సమంత తన ఫ్యాషన్ ఎంపికల ద్వారా కూడా తన మనోభావాలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. 2024లో, తన తెలుపు రంగు వెడ్డింగ్ గౌన్‌ను బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌గా మార్చుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిమానులు దీన్ని "రివెంజ్ డ్రస్" అని అభివర్ణించారు. అయితే, సమంత మాత్రం దాన్ని కొత్త జీవితాన్ని స్వీకరించడమనే సందేశంగా మలిచింది. ఆమె సుస్థిరమైన ఫ్యాషన్ గురించి చర్చిస్తూ, వాడిన వస్త్రాలను మళ్లీ ఉపయోగించుకోవడం అవసరమని చెప్పింది.

ఇదంతా చూసిన అభిమానులకు ఆమె స్టైల్ కేవలం ట్రెండ్ కోసం కాదని, తన జీవిత మార్గాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని అర్థమైంది. అయితే, తన గతాన్ని పూర్తిగా తీసి పారేసే ప్రయత్నం మాత్రం సమంత చేయడం లేదు. ఆమె జీవితంలోని కొన్ని గుర్తుగా మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్యకు అంకితం చేసిన టాటూ ఇప్పటికీ ఆమె శరీరంపై ఉంది. అది పోగొట్టుకోవడం కష్టం అనే భావనా లేక ఇది కూడా ఒక గుర్తుగా ఉండాలని భావించిందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

కానీ, సమంత తన పద్ధతిలో జీవితాన్ని మళ్లీ నిర్మించుకుంటూ పోతుండటంతో, ఈ అంశాలు ఆమెను పెద్దగా ప్రభావితం చేయడం లేదు. సమంత ఇప్పుడు పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, తన జీవితాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకోవడం ఆమె ప్రధాన లక్ష్యంగా మారినట్లు కనిపిస్తోంది. ఆమె సినిమాల్లో చేస్తున్న ప్రయోగాలు, వ్యక్తిగత జీవితం లో తీసుకుంటున్న నిర్ణయాలు చూసినట్లయితే, ఆమె ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసే వ్యక్తి కాదని స్పష్టంగా అర్థమవుతోంది. వ్యక్తిగత జీవితం ఎంత కఠినమైనదైనా, దానిని తనదైన శైలిలో స్వీకరించి, ముందుకు సాగడమే ఆమె ధోరణిగా మారింది.